శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి స్వాగతం పలికిన ఏవీ కుటుంబం
నంద్యాల ఫిబ్రవరి 6,
కర్నూల్ జిల్లాలోని ప్రధాన నవ నారసింహ దేవాలయం అహోబిలం.దేవాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పారవేట ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.స్వామివారు ఆళ్ళగడ్డకు చేరుకోగానే మాజీ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మెన్ ఏవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.ఏవీ సుబ్బారెడ్డి తో పాటు ఆయన భార్య ,ముగ్గురు కుమార్తెలు స్వామివారి పల్లకిని మోశారు.అనంతరం ఏవి సుబ్బారెడ్డి గృహం వద్ద తెలుపు ఉండటంతో దేవుడి పల్లకిని అక్కడ దించారు.అనంతరం ఏవి కుటుంబసభ్యులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి,జశ్వంతి రెడ్డిలు మాట్లాడుతూ ఏడాదిగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని అన్నారు.కరోనా వ్యాధితో రైతులు,వ్యాపారులు,పేద,మధ్య తరగతి ప్రజలు నష్టపోయారని అన్నారు.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కరోనా వ్యాధిని పారద్రోలి ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామని అన్నారు.పారవేట సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగా అన్నదానం చేశారు.కుటుంబసభ్యులు స్వయంగా భక్తులకు అన్నం వడ్డించడంతో పలువురు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని దీవించారు.