యాదాద్రిలో ప్రభుత్వ ఛీఫ్ విప్ పూజలు
యాదగిరిగుట్ట ఫిబ్రవరి 6,
రానున్న రోజుల్లో యాదాద్రి నరసింహుడి క్షేత్రం ప్రపంచ ఆద్యాత్మిక క్షేత్రంగా మారబోతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు. ఉదయం కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న వెంకటేశ్వర్లు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో పులా మాలతో స్వాగతం పలికి దర్శనంతరం ప్రత్యేక ఆశీర్వచనం చేశారు.చిప్ విప్ కి ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా మార్చడానికి సీఎం కేసీఆర్ అంకుఠిత దీక్షతో పని చేస్తున్నారనడానికి యాదాద్రిలో జరుగుతున్న పనులే నిదర్శనమన్నారు.దేశంలో తెలంగాణ ధాన్యగారం గా రెండవ స్థానంలో ఉండడం చాలా సంతోషకరంన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు,రైతులు సంతోషంగా ఉన్నారన్నారు వెంకటేశ్వర్లు.