YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు రైతు సెగ

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు రైతు సెగ

 కెప్టెన్ కు రైతు సెగ
ఛండీఘడ్, ఫిబ్రవరి 6 
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దూకుడు పెంచుతున్నారు. అన్ని అంశాలను తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో రెండేళ్లలో పంజాబ్ లో అసెంబ్లీ 
ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కు మంచి పేరు ఉంది. నిజాయితీ పరుడన్నది వాస్తవం.అయితే గత రెండు నెలలుగా 
జరుగుతున్న రైతు ఉద్యమాన్ని కూడా అమరీందర్ సింగ్ వెనక ఉండి నడిపిస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది పంజాబ్, హర్యానాకు చెందిన వారే. ఇక్కడ చేస్తున్న 
రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఉన్నారని, అందుకే రోడ్డు మీద కూడా వారికి అన్ని రకాల సదుపాయాలు దక్కుతున్నాయి. నిజానికి దేశంలో అన్ని రాష్ట్రాల రైతుల కన్నా పంజాబ్ రైతులు 
ధనికులుకేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో అమరీందర్ సింగ్ తీర్మానం చేశారు. రాహుల్ గాంధీని పంజాబ్ కు పిలిపించి మరీ ట్రాక్టర్ ర్యాలీని రైతులకు మద్దతుగా నిర్వహించారు. ఇప్పటికే 
అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేసింది. బీజేపీ, అకాలీదళ్ విడివిడిగా పోటీ చేస్తే తమకు కలసివస్తుందని అమరీందర్ సింగ్ అంచనాలో ఉన్నారు.కానీ ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతుల ర్యాలీలో 
తలెత్తిన ఘర్షణలు అమరీందర్ సింగ్ కు ఇబ్బందికరంగా మారే అవకాశముందంటున్నారు. ఇప్పటికే బీజేపీ దీనిపై ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఢిల్లీ ఘటనల వెనక అమరీందర్ ప్రమేయం ఉందని అకాలీదళ్ సయితం ప్రజల్లోకి 
విస్తతంగా తీసుకెళుతుంది. అందుకే అమరీందర్ ఘటన జరిగిన రోజే స్పందించారు. ఇది తనకు షాకింగ్ న్యూస్ అని చెప్పారు. కొన్ని శక్తులు ఇందులోకి చేరి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ నగరం నుంచి తిరిగి బోర్డర్ కు 
చేరుకోవాలని అమరీందర్ పిలుపునివ్వడం విశేషం. మొత్తం మీద అమరీందర్ పై ఇన్నాళ్లకు విపక్ష పార్టీలకు రైతు ఉద్యమంలో తలెత్తిన హింస ఆయుధంగా దొరికింది.

Related Posts