రాహుల్ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ, చారం లో మోదీపై చేసిన విమర్శలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తప్పుపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ఒక ప్రసహనం అని కొట్టిపారేశారు. ప్రజాస్వామ పాలనకు గండి కొట్టి ఆనువంశిక పాలనను శాశ్వతం చేసే ప్రయత్నమని ఆరోపించారు. సైన్యంపై నమ్మకం లేదు. న్యాయవ్యవస్థను, సుప్రీంకోర్టును నమ్మరు. ఎన్నికల సంఘం, ఈవీఎంలు ఆర్బీఐ ఇలా ఎవరిపైనా వాళ్లకి నమ్మకం లేదు అని కాంగ్రెస్‌పై అమిత్‌షా వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు.రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీనే దెబ్బతీస్తోందని, ప్రజాస్వామ్య పాలన కంటే కుటుంబ పాలననే వారు కోరుకుంటున్నారని అమిత్‌షా అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న పార్టీ ఏదైనా ఉంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. రాజ్యాంగాన్ని తామే రూపొందించినట్టు కాంగ్రెస్ పదేపదే చెబుతుంటుంది. అయితే డాక్టర్ అంబేద్కర్‌ను పదేపదే అవమానించే ఆయన కుటుంబ సంప్రదాయాన్నే రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ బతికుండగా నెహ్రూ-గాంధీ కుటుంబం ఆయనను పదేపదే అవమానిస్తూ వచ్చింది. అంతకంటే ఎక్కువగానే ఇప్పుడు ఆయనను అవమానపరుస్తున్నారు. ఇది ఎంతో సిగ్గుచేటు అని అమిత్‌షా మరో ట్వీట్‌లో అన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ నుంచే పరిరక్షించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఈసీ, సుప్రీంకోర్టు, ఆర్మీ సహా ఏ సంస్థలనూ కాంగ్రెస్ విడిచిపెట్టడం లేదని అమిత్‌షా మరో ట్వీట్‌లో ఆరోపించారు.