YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆగ్రగామిగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

ఆగ్రగామిగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

ఆగ్రగామిగా తెలంగాణ
మంత్రి ఎర్రబెల్లి
మేడ్చల్ ఫిబ్రవరి 6 
మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో అంకుశపూర్, ప్రతాప్ సింగారం గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రైతు వేదికలను మంత్రి మల్లా రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో స్వచ్ఛమైన కల్తీ లేని సేంద్రియ పద్ధతుల్లో చేసిన నిత్యావసర వస్తువులు దొరుకుతాయి అన్నారు.
అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా వుంది. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నేతృత్వంలో జరిగుతున్నది. రైతులకు సీఎం చేసినంతగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు చేయలేదు. మన రాష్ట్రంలో రైతుల కోసం అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో, మరే రాష్ట్రం లోనూ జరగడం లేదు. సీఎం కేసిఆర్ రైతు పక్షపాతి. రైతుల ఆత్మ బంధువు. పేదల ఇంట్ల పెద్దన్న అని మంత్రి అన్నారు.
సాగునీరు, ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడి, రుణాల మాఫీ, పంటల కొనుగోలు... ఇలా 18 రకాల పథకాలు అమలు అవుతున్నాయి. రైతాంగానికి ఉచిత విద్యుత్ కోసం రాష్ట్రం 10వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మంచి చెడులను ఎంచుకుని... ఆలోచించాలి. పల్లె ప్రకృతి వనాలు,నర్సరీ,వైకుంఠ ధామాలతో గ్రామాల్లో కొత్త అందాలు గా మారాయని అన్నారు.
ఇప్పుడు గ్రామాల్లో రైతులకు కళ్ళాలు,రైతు వేదికలు,అంతర్గత రోడ్లు,డ్రైనేజీలు గ్రామాల మధ్య లింక్ రోడ్లు ఇట్లా అనేక విధాల అభివృద్ది కొనసాగుతున్నది. సీఎం గారి ఆలోచనలతో పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు ట్రాక్టర్లను సమకూర్చడం జరిగింది. ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లను విడుదల చేస్తున్నది. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారని అన్నారు.
=========================

Related Posts