YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైతు ఉద్యమంపై స్పందించిన ఐరాస మానవహక్కుల కమిషన్

రైతు ఉద్యమంపై స్పందించిన ఐరాస మానవహక్కుల కమిషన్

రైతు ఉద్యమంపై స్పందించిన ఐరాస మానవహక్కుల కమిషన్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 6 
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలపై ఐరాస మానవహక్కుల కమిషన్ స్పందించింది. రైతులు, కేంద్రం సంయమనం పాటించాలని కోరింది. అందరి మానవ హక్కులను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కనుగొనాలని తెలిపింది. త్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్లో సాగుతున్న రైతు ఉద్యమంపై ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయం(ఓహెచ్సీహెచ్ఆర్) స్పందించింది. పాలనాయంత్రాంగం, ఆందోళనాకారులు గరిష్ఠ సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.
అందరి మానవ హక్కులను తగు రీతిలో గౌరవిస్తూ సమస్యలకు నిష్పాక్షిక పరిష్కార మార్గాలను కనుగొనాలని కోరింది. శాంతియుతంగా సమావేశామయ్యేందుకు, భావ వ్యక్తీకరణకు ఉద్దేశించిన హక్కులను ఆఫ్లైన్లోనూ, ఆన్లైన్లోనూ పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది.

Related Posts