YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రాజీవ్ రహదారి నెత్తురోడుతుంది. 

రాజీవ్ రహదారి నెత్తురోడుతుంది. 

రాజీవ్ రహదారి నెత్తురోడుతుంది. 
రామగుండం ఫిబ్రవరి 6 
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారి జిఎం కార్యాలయం మూలమలుపు వద్ద డెత్ బెల్స్ మోగుతున్నాయి.ఇప్పటికే పదుల సంఖ్యలో లారీలు డిసిఎం వ్యాన్లు అదుపుతప్పి పల్టీలు కొడుతున్నాయి .కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు అవిటివారై బ్రతుకు భారాన్ని మోస్తున్నారు.ఈ నిర్లక్ష్యానికి   రాజీవ్ రహదారి నిర్మాణం లో విధులు నిర్వహించిన ఇంజనీర్ల అవగాహన రాహిత్యమా... నిర్మాణం పూర్తయ్యాక పర్యవేక్షించిన అధికారుల తప్పిదమ అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిఎం కార్యాలయం మూలమలుపు తక్కువగా ఉండి స్పీడ్ కంట్రోల్ కాకపోవడం తో ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు  పేర్కొంటున్నారు.  ట్రాఫిక్ పోలీసులు,ప్రజా ప్రతినిధులు పలుమార్లు సంబంధిత అధికారులను కలిసిన ప్రయోజనం లేకుండా పోయింది.ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు పెట్టిన ప్రమాదాలను అరికట్టలేని పరిస్థితి.నిర్మాణ లోపాన్ని సరి చేసి శాశ్వత పరిష్కారాన్ని చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ డేంజర్ మూలమలుపు పై అవగాహన కలిగిన  స్థానికులకు  ఇబ్బంది లేకపోయినా మహారాష్ట్ర,  చత్తీస్గడ్, వైపునుండి   వచ్చే వాహనాలు  ఈ మూలమలుపు వచ్చేసరికి  ఇనుప ముక్కను  అయస్కాంతం  గుంజినట్టు  వాహనాలను  ఈ మూలమలుపు వచ్చేసరికి కింద పడుతున్నాయి.వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి అధికారులు, ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి జిఎం కార్యాలయం మూల మలుపు ప్రమాదాల నివారణకై కృషిచేస్తామన్నారు.ప్రమాదాల నివారణకై  ట్రాఫిక్ పోలీస్ లా ప్రయత్నాన్ని ఎమ్మెల్యే చందర్ అభినందించారు.

Related Posts