YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం

ఫెయిర్‌నెస్ క్రీములు,ఆయింట్‌మెంట్లకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి

ఫెయిర్‌నెస్ క్రీములు,ఆయింట్‌మెంట్లకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి
ఇక నుంచి ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను విక్రయించాలంటే డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి అని కేంద్రవైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు.14 రకాల ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లలో స్టెరాయిడ్లు ఉన్నందున మెడికల్ షాపు యజమానులు వీటిని వైద్యనిపుణుల ప్రిస్కిప్షన్ లపైనే విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలకు మందులు,ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను మెడికల్ దుకాణాల్లోని కౌంటర్లలో ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించరాదని కేంద్రం కోరింది. ఈ మేరకు డ్రగ్స్, కాస్మెటిక్స్ రూల్స్ 1945 ప్రకారం ప్రిస్కిప్షన్ లేకుండా ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కేంద్రఆరోగ్యశాఖ హెచ్చరించింది. స్టెరాయిడ్లతో తయారైన ఫెయిర్‌నెస్ క్రీములు, ఆయింట్‌మెంట్లను దుర్వినియోగం చేస్తున్నారని చర్మవ్యాధుల నిపుణులు చేసిన ఫిర్యాదుల మేర కేంద్రవైద్యఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది.

Related Posts