YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిన్నమ్మ వైపే... అమ్మ ఫ్యాన్స్

చిన్నమ్మ వైపే... అమ్మ ఫ్యాన్స్

చెన్నై, ఫిబ్రవరి 8, 
శశికళ నాలుగేళ్ల జైలు జీవితం ముగిసింది. ఆమె విడుదలయ్యారు. నాలుగేళ్ల పాటు రాజీకీయాలకు శశికళ పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది. జయలలిత సన్నిహితురాలిగా తానే వారసురాలినని ప్రకటించుకునే లోపే ఆమె బెంగళూరు జైలుకు వెళ్లారు. కేసులు లేకుంటే ఆమె ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే వారు. అక్రమాస్తుల కేసు శశికళకు సీఎం కుర్చీ దూరం చేయడంతో పాటు జైలు పాలు చేసింది. అయితే ఆమెకు పెద్దయెత్తున తమిళనాడులో సానుభూతి లభిస్తుందంటున్నారు.జయలలిత జీవించి ఉండగా అంతా తానే అయి శశికళ నిర్వహించేవారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం లేకపోయినా పార్టీ కార్యక్రమాల్లో శశికళ పాత్ర అప్పట్లో ఉండేది. జయలలిత చివరి రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఆమె నుంచే వెలువడ్డాయంటారు. తన కుటుంబాన్ని పక్కన పెట్టి జయలలిత సేవలోనే గడిపిన శశికళకు జైలు శిక్ష పడటంపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వస్తుందంటున్నారు.దీంతో పాటు శశికళ వచ్చిన వెంటనే అన్నాడీఎంకే నుంచి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సయితం ఆమెవైపు వెళతారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు శశికళకు టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. శశికళ అన్నాడీఎంకేకు నేతృత్వం వహిస్తేనే పార్టీ మరోసారి విజయం సాధిస్తామని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి గోకుల ఇందిర, మంత్రి రాజేంద్ర బాలాజీ సయితం శశికళ రాకను స్వాగతిస్తూ వ్యాఖ్యానాలు చేయడం విశేషం.శశికళను తిరిగి పార్టీలో చేర్చుకోకుంటే తాము వెళ్లిపోతామని కొందరు అన్నాడీఎంకే నాయకత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. కానీ శశికళను పార్టీలోకి తిరిగి తీసుకునేది లేదని పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు చెబుతున్నారు. దీంతో సానుభూతి పవనాలు శశికళవైపు ఎక్కువగా వీస్తాయని భావించిన అన్నాడీఎంకే నేతలు ఆమె వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. శశికళ చెన్నైలోకి అడుగుపెట్టిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.

Related Posts