YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఫేక్ ఇన్పూరెన్స్ దందా...

ఫేక్ ఇన్పూరెన్స్ దందా...

హైదరాబాద్, ఫిబ్రవరి 8, 
సిటీలో నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ దందా అడ్డగోలుగా సాగుతోంది. ఓనర్ షిప్ మార్పు నుంచి ఫిట్ నెస్ వరకు అన్నింటికి ఇన్సూరెన్స్ తప్పని సరి కావటంతో ఫేక్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. వాహనాదారుల నుంచి వేలల్లో వసూలు చేస్తూ ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నాయి. వీటితో వెహికల్ ఓనర్లు ఆర్టీఏ ఆఫీసుల్లో తమ పని పూర్తి చేసేసుకుంటున్నారు. ఆర్టీఏ అధికారులకు కూడా ఇవి ఫేక్ ఇన్సూరెన్స్ లని తెలిసినప్పటికీ పట్టించుకుంట లేరు. దీంతో ఫేక్ ఇన్సూరెన్స్ లు చేయించుకునేటోళ్లు, చేసేటోళ్లు పెద్ద ఎత్తున పెరిగి పోయారు.సాధారణంగా ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కు ఇన్సూరెన్స్ చేయించాలంటే వేలల్లో ఉంటుంది. ఏటా ఇన్సూరెన్స్ చేయించాలంటే ఎక్కుడ డబ్బు కట్టాలి. దీంతో చాలా మంది రాంగ్ రూట్ ఎంచుకుంటున్నారు. రెండు, మూడు వేలు చెల్లిస్తే చాలు ఇన్సూరెన్స్ ఉన్నట్లుగా బ్రోకర్లు ఓ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. దీన్నే ఇన్సూరెన్స్ గా ఆర్టీఏ అధికారులకు చూపిస్తున్నారు. కొన్నేళ్లుగా సిటీలో ఈ దందా నడుస్తోన్నా ఇటీవల మరీ ఎక్కువ అయ్యింది. ఇందుకోసం కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఫేక్ ఇన్సూరెన్స్ లు రెడీ చేస్తున్నారు. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఉండే బ్రోకర్లను కలిస్తే చాలు ఈ ఫేక్ ఇన్సూరెన్స్ ఇప్పించేస్తున్నారు. ఇందులో చాలా మందికి వాటాలు పోతున్నట్టు సమాచారం.ఆర్టీఏ ఆఫీసుల్లో బహిరంగంగానే ఏజెంట్లు ఫేక్ ఇన్సూరెన్స్ ల కోసం కస్టమర్ల దగ్గరికి వస్తుంటారు. వెహికల్ ను బట్టి చార్జ్ చేస్తారు. టూ వీలర్ అయితే రూ. 1200, ఆటో  రూ.2 –3 వేలు, ఫోర్ వీలర్ అయితే రూ. 5 –6 వేలు కడితే ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. ఆటోలు, కార్లు, స్కూల్ వ్యానులు, హేవీ వెహికల్స్ రెన్యువల్, ఫిట్ నెస్, ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్, క్యాన్సిల్ వంటి సేవలు కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాల్సిందే.  కానీ చాలా వెహికల్స్ ఓనర్లకు ఈ విషయం తెలియక ఆర్టీఏ ఆఫీస్ వరకు వస్తుంటారు. దీంతో కొంతమంది ఆర్టీఏ అధికారులే వారిని ఫేక్ ఇన్సూరెన్స్ ఇచ్చే వారి వద్దకు పంపుతున్నారు. అవసరాన్ని బట్టి గంటల్లో ఇన్సూరెన్స్ రెడీ చేసి ఇచ్చేస్తుంటారు. కొంతమంది అమాయకులైన వెహికల్స్ ఓనర్లకు నకిలీ ఇన్సూరెన్స్ ను  కట్టబెట్టి దాన్నే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు.జనవరిలో ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ లను స్వాధీనం చేసుకున్నారు.  గ్రేటర్ లో కనీసం 50 లక్షల వెహికల్స్ ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్కు సంబంధించి సగానికి పైగా నకిలీ ఇన్సూరెన్స్ లే ఉంటాయి. ఇవి ఫేక్ అని తెలిసినప్పటికీ ఆర్టీఏ అధికారులు కూడా పనులు చేసేస్తుండటం విశేషం. దీనికి కారణం ఇన్సూరెన్స్ ఒరిజినలా? కాదా అని చెక్ చేసేందుకు సరైన సిస్టమ్ లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని ఫేక్ గ్యాంగ్స్,  కొందరు ఆర్టీఏ అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు.  క్యూ ఆర్ కోడ్ రీడ్ చేసినప్పుడు వెహికల్ ఓనర్ పేరు కనిపిస్తే చాలు మేము ఇన్సూరెన్స్ ఉన్నట్లే భావిస్తామని అధికారులు చెబుతున్నారు.వెహికల్కు ఇన్సూరెన్స్ ఉంటే యాక్సిడెంట్స్ టైమ్లో గాయపడిన వారికి ట్రీట్ మెంట్ కోసం, ఎవరైనా చనిపోయినా కంపెనీ నుంచి డబ్బులు వస్తాయి. వెహికల్ డ్యామేజ్ అయిన సరే రిపేర్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయి. కానీ ఫేక్ ఇన్సూరెన్స్లతో ఇవన్నీ కుదరవు. ప్రమాదం జరిగినప్పుడు బాధితుడు, వెహికల్ ఓనర్ ఇద్దరు నష్టపోవాల్సిందే. చాలా వరకు ఫేక్ ఇన్సూరెన్స్ ల వ్యవహరం ప్రమాదాలు జరిగినప్పుడే బయటపడుతోంది. యాక్సిడెంట్ల కారణంగా నష్టపోయే వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ ను మస్ట్ చేశామని..కానీ కొందరు ఇలా దొంగ ఇన్సూరెన్స్ల ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేరకుండా చేస్తున్నారని   ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు.

Related Posts