తిరుచానూరు లో ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేసాడు. తిరుచానూరు లో నివసిస్తున్న కుమార్ అనే వ్యక్తి శ్రీ గోవిందా రాజా స్వామి ఆలయంలో కాంట్రాక్టు పద్ధతిన వాహన బేరర్ గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి తిరుచానూరు లోని సూర్యనారాయణ ఆలయం సమీపంలో ని వ్యాపారులుతో గొడవ పడ్డాడు. అడ్డం వచ్చిన స్థానికులను గాయపరిచాడు. విషయం తెలుసుకున్న ఎస్ ఐ రామాంజనేయులు తనసిబ్బంది తో ఆ వ్యక్తి ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా కానిస్టేబుల్ జనార్దన్ ను కుమార్ ను గాయపరిచాడు. తరువాత ఎస్ ఐ రామాంజనేయులు తన సిబ్బంది తో అదుపులోకి తీసుకున్నారు. కుమార్ పై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.