YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

హెచ్‌పీఈలో మార్కులు సాధింస్తేనే 10,12తరగతుల బోర్డు పరీక్షలకు అనుమతి, 150 పేజీలతో మార్గదర్శకాలను విడుదల చేసిన సీబీఎస్‌ఈ

 హెచ్‌పీఈలో మార్కులు సాధింస్తేనే 10,12తరగతుల బోర్డు పరీక్షలకు అనుమతి, 150 పేజీలతో మార్గదర్శకాలను విడుదల చేసిన సీబీఎస్‌ఈ
ఆరోగ్య, శారీరక వ్యాయామ విద్య (హెచ్‌పీఈ) తరగతులపై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 150 పేజీలతో మార్గదర్శకాలను విడుదల చేసింది.హెచ్‌పీఈ తరగతులకు ప్రతి విద్యార్థి హాజరు కావాలని, ఆ సబ్జెక్ట్‌కు కూడా మార్కులు ఉంటాయని సీబీఎస్‌ఈ తన తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. పీఈటీ పిరియడ్‌లో వ్యాయామ ఉపాధ్యాయుల నేతృత్వంలో1 నుంచి 12 తరగతుల విద్యార్థులు వ్యాయామాలు,క్రీడల్లో పాల్గొంటారు. హెచ్‌పీఈలో విద్యార్థులు ప్రాజెక్టులను కూడా చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై అవగాహన, వ్యాయామంతోపాటు.. వారు సమాజ సేవకూడా చేయాల్సి ఉంటుంది.హెచ్‌పీఈ బోధనకు వ్యాయామ ఉపాధ్యాయులే ఉండాలనే నిబంధన లేదు. తరగతి టీచర్, ఇతర సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు కూడా ఈ పాఠాలను చెప్పవచ్చు. వారే విద్యార్థులకు పనితీరును బట్టి మార్కులు లేదా గ్రేడ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్‌పీఈలో మార్కులు సాధించే విద్యార్థులకే 10,12తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది. హెచ్‌పీఈ అనేది పూర్తిస్థాయిలో ప్రాక్టికల్‌ ప్రోగ్రాం. హెచ్‌పీఈ మార్కులను బోర్డు పరీక్షల మెమోల్లో పరిగణనలోకి తీసుకోం అని వివరించింది. చిన్న తరగతుల విద్యార్థులపై హోంవర్క్‌ భారాన్ని తగ్గించాలంటూ జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ) సీబీఎ్‌సఈకి సూచిస్తూ.. మార్గదర్శకాలను పంపింది. . తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు శారీరక వ్యాయామ పిరియడ్‌ను కేటాయించాలంటూ సీబీఎస్‌ఈ గత నెల అన్ని స్కూళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే.

Related Posts