YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

శిల్ప నర్సింగ్ హోమ్ లో అరుదైన శస్త్రచికిత్స

శిల్ప నర్సింగ్ హోమ్ లో అరుదైన శస్త్రచికిత్స

ఎమ్మిగనూరు ఫిబ్రవరి 8, 
పట్టణంలోని స్థానిక శిల్ప నర్సింగ్ హోమ్ లో  అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసి  మూడుకిలోల బరువుగల అండాశయ కణితిని తొలగించారు.వివరాల్లోకి వెళితే స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్ననగర్ కు చెందిన గర్భిణి మీనాక్షికి ప్రసూతి నిమిత్తం స్థానిక శిల్ప నర్సింగ్ హోమ్ లో స్కానింగ్ చేయగా మీనాక్షి కడుపులో అండాశయ కణితి ఉన్నట్టు గుర్తించిన డాక్టర్ జి.శిల్ప శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా కణితిని తొలగించినట్టు,సర్జరీ అనంతరం పేషంట్ ఆరోగ్యంగా ఉన్నట్టు శిల్ప నర్సింగ్ హోమ్ డాక్టర్ డాక్టర్ జి.శిల్ప  తెలిపారు.ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ శిల్పతోపాటు అనస్థీషియా డాక్టర్ చంద్రశేఖర్ మరియు శిల్ప హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శిల్ప మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణ,  పరిసర గ్రామ మహిళకు సత్వరసేవలు అందించడానికి తాము తమ హాస్పిటల్ సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉంటామని,ప్రజల నుండి సరైన సహాయసహకారాలు ఉంటే స్త్రీ ప్రసూతికి సంబంధించి మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకుని రావడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Related Posts