రాజన్న సిరిసిల్ల ఫిబ్రవరి 8
రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన లో బాగంగా గంభీరావుపేట మండల కేంద్రంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని మంత్రి కేటిఅర్ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, తదితరులు పాల్గొన్నారు.అనంతరం గంభీరావుపేటలో మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ పత్రాలు పంపిణీ చేస్తారు. తర్వాత నర్మాలలో రైతు వేదికను ప్రారంభిస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. నర్మాలలో శ్మశానవాటిక, పాఠశాలలో అదనపు తరగతిగదులను ప్రారంభిస్తారు. కొత్తపల్లిలో మహిళాసంఘం నూతన భవనం, లింగన్నపేట, మల్లారెడ్డిపేటలో నిర్మించిన రైతు వేదికలను ప్రజలకు అంకితం చేస్తారు.