YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

రెండవ రోజూ ఎదురుకాల్పులు…ఐదుగురు మావోయిస్టులు మృతి

రెండవ రోజూ ఎదురుకాల్పులు…ఐదుగురు మావోయిస్టులు మృతి
సుకుమా జిల్లా చాంద్ మెట్ అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  ఐదు మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది కి గాయాలైనట్లు సమాచారం. దండకారణ్యాన్ని ఏలుతున్న నక్సల్స్కు గత 38 ఏళ్లలోనే ఎదురుకాని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ సరిహద్దులో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు డివిజినల్ కమిటీ సభ్యులు ఉన్నారు. రాత్రి పొద్దుపోయేక నక్సల్స్ ప్రతీకార దాడులు జరిపే ప్రమాదం ఉందని అనుమానిస్తున్న పోలీసులు.. అడవిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారంఉదయం నక్సల్ వ్యతిరేక ప్రత్యేక దళానికి చెందిన సీ-60 కమాండోలు గడ్చిరోలి జిల్లా భామరాగడ్  మండలం తాడ్గావ్కు సమీపాన గల అటవీప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఎటాపల్లి బొరియ అటవీప్రాంతంలో వీరికి పెరిమిలి దళం కంటబడింది. పోలీసులకు, నక్సల్స్కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నక్సల్స్ తమ కార్యకలాపాలు సాగించడానికి బీడీ గుత్తేదారుల నుంచి వసూలు చేసే డబ్బుపై ప్రధానంగా ఆధారపడుతుంటారు. ప్రస్తుతం తెందుచెట్ల నుంచి ఆకులు రాలే కాలం. ఈ చెట్ల నుంచి కోసిన ఆకులను ఎండబెట్టి బీడీలను తయారుచేస్తారు. ఈ వ్యాపారం చేసే గుత్తేదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్ నాయకులు అడుగుపెట్టారని పోలీసులకు సమాచారం అంది ఉంటుందని వార్తలు వినవస్తున్నాయి.  దీనితో సరిహద్దు ప్రాంతంలొ ఏప్పుడు ఏమి జరుగుతుందోనని మన్యం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Related Posts