YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జ‌మ్మూక‌శ్మీర్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ(స‌వ‌ర‌ణ‌) బిల్లుకు ఆమోదం

జ‌మ్మూక‌శ్మీర్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ(స‌వ‌ర‌ణ‌) బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ ఫిబ్రవరి 8 
జ‌మ్మూక‌శ్మీర్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ(స‌వ‌ర‌ణ‌) బిల్లు 2021కు ఇవాళ రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది.  దీనిపై కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడారు. బిల్లులో భాగంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ల‌ను క‌లిపామ‌న్నారు.  అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, గోవా, మిజోరం, కేంద్ర పాలిత క్యాడ‌ర్‌ను.. ఏజీఎంక్యూటీ క్యాడ‌ర్‌గా గుర్తించ‌నున్నారు.  జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర‌హోదాను ఇవ్వాల‌ని కాంగ్రెస్ నేత గులాం న‌బీ ఆజాద్ కోరారు. ఒక‌వేళ ప్ర‌స్తుతం ఉన్న క్యాడ‌ర్ బాగా ప‌నిచేస్తుంటే, మరి ఆ క్యాడ‌ర్‌ను ఎందుకు విలీనం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.  జేకేను శాశ్వ‌తంగా యూటీగా ఉంచాల‌ని కేంద్ర భావిస్తున్న‌ట్లు ఆజాద్ డౌట్ వ్య‌క్తం చేశారు.  7107 ప‌రిశ్ర‌మ‌ల‌ను మూసివేశార‌ని, రాష్ట్రానికి కొత్త ప‌రిశ్ర‌మ‌లు రాలేదన్నారు.  వీలైనంత త్వ‌ర‌గా రాష్ట్ర‌హోదాను క‌ల్పించి.. క‌శ్మీర్‌లో త్వ‌ర‌గా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఆజాద్ డిమాండ్ చేశారు.  
బీజేపీ ఎంపీ దుశ్యంత్ గౌత‌మ్ మాట్లాడుతూ ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో.. జ‌మ్మూక‌శ్మీర్‌లో స్వేచ్ఛ వచ్చింద‌న్నారు. దాంతోనే అక్క‌డ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. త్రివ‌ర్ణ ప‌తాకం ఇప్పుడు అక్క‌డ స్వేచ్ఛ‌గా ఎగురుతోంద‌న్నారు.  అన్నాడీఎంకే నేత న‌వ‌నీతం మాట్లాడుతూ.. పాక్‌, చైనాల‌ను దృష్టిలో పెట్టుకుని.. జ‌మ్మూక‌శ్మీర్ నేరుగా కేంద్ర పాల‌న కిందే ఉంటే బెట‌ర్ అని అన్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో క్యాడ‌ర్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని, విలీనంతో మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు.  2019లో పాక్ జ‌రిపిన కాల్పుల్లో 127 మంది గాయ‌ప‌డ్డార‌ని, 2020లో 71 మంది గాయ‌ప‌డిన‌ట్లు చెప్పారు. 2019లో 216 మంది అక్ర‌మంగా చొర‌బ‌డ్డార‌ని, 2020లో 99 చొర‌బాట్లు అయిన‌ట్లు మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు.  2019లో 157 మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  2020లో 221 మంది ఉగ్ర‌వాదులు చ‌నిపోయార‌న్నారు.  

Related Posts