YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చిరంజీవితో మంత్రి ఈటెల భేటి.. సినీ..రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..

చిరంజీవితో మంత్రి ఈటెల భేటి..   సినీ..రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..

హైదరాబాద్ ఫిబ్రవరి 8 
రోటీన్ కు భిన్నమైన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కీలక నేత.. రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్.. మరికొందరు నేతలతో కలిసి  చిరంజీవి ఇంటికి వెళ్లటం.. అనంతరం ఏకాంతంగా భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ అంశం సినీ..రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెల చిరు ఇంటికి ఎందుకు వెళ్లినట్లు? అన్నది ప్రశ్నగా మారింది. అయితే.. రాజకీయ కోణంలో ఎందుకు చూడాలన్న మాట మరికొందరి నోటి నుంచి వినిపిస్తోంది.తన జిల్లాలోని హుజూరాబాద్ కు చెందిన కళాకారులు.. నిరుద్యోగ యువతకు సినీ పరిశ్రమలో ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లుగా చెబుతున్నారు. మంత్రి ఈటెల మాటకు చిరు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈటెలతో పాటు బండ శ్రీనివాస్.. తుమ్మేటి సమ్మిరెడ్డితదితరులు ఉన్నారు.తన జిల్లాలోని ఒక ప్రాంతానికి చెందిన కళాకారుల కోసం మంత్రిఈటెల చిరు ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఆయనకు సొంతంగా స్టూడియో లేదు. నిర్మాణ సంస్థ మాత్రమే ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించటానికి చిరు ఏమీ కీలక స్థానంలో లేరు. గతంలో ఆయన ప్రత్యేకించి ఒక ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇవ్వటానికి అవసరమై ప్లాట్ ఫాం లేదు.అలాంటప్పుడు.. ఈటెల భేటీ వెనుక అంతర్యం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి.. ఈటెల కోరితే చిరునే నేరుగా వచ్చి కలిసే పరిస్థితి. అలాంటప్పుడు.. తాజా భేటీ ఎందుకు? అన్నది ప్రశ్న. ఇదిలా ఉంటే.. సీఎం మార్పుపై కొంతకాలంగా (ఆదివారం కేసీఆర్ తేల్చేశారునుకోండి) జరుగుతున్న చర్చ నేపథ్యంలో చిరును కలిశారా? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. చిరు ఇంటికి మంత్రి ఈటెల వెళ్లటం.. ఏకాంత భేటీ కావటం మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Related Posts