విశాఖపట్నం ఫిబ్రవరి 08
ఎమ్మెల్యే పదవికి తాను చిత్తశుద్ధితో రాజీనామా చేశానని గంటా శ్రీనివా సరావు చెప్పారు. ఉద్యమానికి ఊపు తేవాలని రాజీనామా చేశానని కొందరు జోకర్స్ తన రాజీనామా పై కామెంట్ చేస్తున్నారని చెప్పారు. నా రాజీనామా పై డిపాజిట్ రాని వారు కూడా విమర్శించారని అన్నారు.నా లెటర్ హెడ్ ఖాళీది ఇస్తున్నానని స్పీకర్ ఫార్మేట్ రాసి ఇవ్వండి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సాక్షిగా తాను లెటర్ హెడ్ లో సంతకం చేసి ఇస్తున్నాననిం దానిని స్పీకర్ కి పంపిస్తానని తెలిపా రు.నా రాజీనామాలపై రాజకీయాలు చేయవద్దని చెప్పారు.