YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కర్నూలులో వడివడిగా విమానశ్రయం అడుగులు

కర్నూలులో వడివడిగా విమానశ్రయం అడుగులు

కర్నూలులో వడివడిగా విమానశ్రయం అడుగులు
కర్నూలు, ఫిబ్రవరి 9, 
కర్నూలు జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరింది. కర్నూలు నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలకు విమానయానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తక్కువ ఖర్చులో ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధమైంది కందనవోలు ఎయిర్ పోర్టు. దీంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కంపెనీకి అనుబంధంగా విమానాశ్రయం ఏర్పాటైంది. 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం తక్కువ ఖర్చులో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రణాళికలు చేసింది. అందులో భాగంగా 50 స్థలాలు గుర్తించింది కేంద్రం. ఈ 50 ప్రాంతాల్లో ఒకటైన ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు కోసం వెయ్యిపది ఎకరాల భూమి సేకరించారు అధికారులు. వ్యవసాయ భూములతో పాటు ప్రభుత్వ భూములను సేకరించి విమానాశ్రయ ఏర్పాటుకు సిద్ధం చేశారు.ఇక ప్రభుత్వం సేకరించిన స్థలాన్ని కేంద్రం ఆమోదించడంతో.. 2017లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. విమానాశ్రయ నిర్మాణానికి 110 కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. కాంట్రాక్ట్ దక్కించుకున్న జెఆర్‌సీ, కేసీవీఆర్ కంపెనీ 18 నెలల్లో ఎయిర్ పోర్టు నిర్మించింది. 2018 డిసెంబర్‌లో రన్‌వేపై ట్రయల్స్ పూర్తి చేసి 2019 జనవరి 8న ప్రారంభించారు. ఈ ఎయిర్ పోర్టులో 2వేల మీటర్ల రన్‌వే, నాలుగు యాప్రాన్ లను సిద్ధం చేశారు. అయితే ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కు సంబంధించిన అనుమతి రాకపోవటంతో ఇప్పటివరకు విమానాలను నడపడానికి వీలు కాలేదు. కానీ తాజాగా విమానయాన సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓర్వకల్లు నుంచి విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది.  గత విజయదశమి కే ఎయిర్‌పోర్టును ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారుల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పనులు పూర్తి చేయడంపై ప్రత్యేక చొరవ చూపారు. పనులలు త్వరగా పూర్తి చేయకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని హెచ్చరించారు. సుదీర్ఘ కాలంగా కర్నూలు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ఓర్వకల్లు విమానాశ్రయం ఎట్టకేలకు అన్ని అవ రోధాలను దాటుకొని పూర్తి స్థాయిలో సేవలు అందిచేందుకు ముస్తాబు అయింది... మార్చి 28 నుంచి ఈ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు విమాన రాకపోకలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి ఓర్వకల్లు నుంచి పలు నగరాలకు విమానాలు నడిపేందుకు ఇండిగో విమానయాన సంస్థ అంగీకరించింది.... ముందుగా కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడపబోతోంది ఉడాన్ స్కీమ్ లో భాగంగా ఈ సర్వీసులు లాంచ్ చేయనున్నట్టు తెలిపిన ఇండిగో సంస్థ ఇప్పటికే ప్రకటించటం తో పాటు అన్ లైన్ లో టికెట్ల కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది మార్చి 28న మొదటి విమాన సర్వీస్ బెంగళూరు నుంచి కర్నూలు ఓర్వకల్లు విమానాశ్రయానికి రానున్నట్టు అధికారికంగా  దేశీ విమానయాన సంస్థల్లో దిగ్గ జంగా పేరు తెచ్చుకున్న ఇండిగో విమానాయాన సంస్థ ఏ. పీ. లో ని కర్నూలు నుంచి విమాన సర్వీసులు ప్రారంభించానున్నామని గతంలోనే ప్రకటించింది అది ఇప్పుడు కార్యరూపం దాల్చాబోబోతోంది మార్చి నుంచి వివిధ నగరాలకు విమాన సర్వీసులు నడపటానికి ఇప్పుడు సిద్ధం అయింది... ఈ ప్రకటన కోసమే సుధీర్గ కాలంగా కర్నూలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఓర్వకల్లు విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కర్నూలు అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజల ఆశ... మరో వైపు ప్రయాణ సమయం కూడా కలిసి వస్తుందని వారు అంటున్నారు మార్చి 28న మొదటి విమానం బెంగళూరు నుంచి వస్తుంది. అదే రోజు నుంచి ప్రయాణికులకు ఇతర నగరాలకు వెళ్లే సేవలు అందుబాటులోకి వస్తాయి ఇక కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమాన ప్రయాణం ప్రయాణికులకు లభ్యం కానుంది. ఓర్వకల్లు నుంచి ప్రయాణికులకు అందుబాటులో వుండే విమాన సర్వీసులకు సంబంధిచిన సమాచారం, విమానాల రాకపోకల షెడ్యూల్ ను ఇండిగో సంస్థ ప్రకటించింది... ఈ ప్రకటన మేరకు ప్రయాణికులకు విమాన సర్వీస్ లు అందుబాటు వుంటాయని అధికారులు వివరించారు. ఇక ప్రతీ సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 10.30 గంటలకు కర్నూలు నుంచి విశాఖపట్నంకు ఇండిగో విమానం బయలుదేరుతుంది అదే రోజు విశాఖపట్నంలో మధ్యాహ్నం ఒంటిగంటకు విమానం కర్నూలుకు బయలుదేరుతుంది...విశాఖపట్నం నుంచి కర్నూలు, కర్నూలు నుంచి విశాఖపట్నం ప్రయాణం చేసే వారికి ఈ విమాన సర్వీస్ సేవలు అందించబోతోంది. ప్రతీ మంగళవారం, గురు, శని, ఆదివారాలలో మధ్యాహ్నం 2-50 గంటలకు చెన్నై నుంచి బయలుదేరే ఇండిగో విమాన సర్వీస్ కర్నూలుకు వస్తుంది అదే రోజు సాయంత్రం 4-30కి కర్నూలు నుంచి చెన్నైకి బయలుదేరుతుంది. ఇక కర్నూలు నుంచి బెంగళూరుకు ఈ విమాన సర్వీస్ లో ఛార్జ్ 2077 రూపాయలు. చెన్నై నుంచి కర్నూలుకు 3144 కాగా కర్నూలు నుంచి విశాఖపట్నం కు 2463 రూపాయలుగా ఇండిగో సంస్థ ప్రకటించింది... ఇవి ప్రాధమిక రేట్లుగా సంస్థ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించాలని తమ సంస్థ భావిస్తోందని వివరించారు. రాతి వనాల మధ్య ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకునే సరికి చాలా మందికి తెలియని ఆనందం మది ని పలకరిస్తు వుంటుంది... ఎన్నో దశాబ్దాల కళ నెరవేరబోతుందన్న నిజం తనువు ను పులకరింపచేస్తుంది. కలలు కనే సామాన్యులు సైతం వాటిని నెరవేర్చుకునేందుకు విహంగ ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిది.... ఏదిఏమైనా ఎట్టకేలకు కందనవోలు నుండి విమాన ప్రయాణంప్రారంభం కాబోతున్న వేళ కర్నూలు వాసుల ఆనందానికి అవధులు లేవు అని ఖచ్చితంగా చెప్పవచ్చు కర్నూలు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానుండటం శుభపరిణామంగా ఇక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు... ఏపీ మూడు రాజధానుల్లో కర్నూలు కూడా ఒకటని, కర్నూలు అభివృద్ధికి ఈ విమాన సర్వీసులు ఎంతో దోహదపడతాయని జిల్లా వాసుల గట్టి నమ్మకం కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై కు వారానికి నాలుగు సార్లు విమాన సర్వీసులు వుంటాయని ఇండిగో సంస్థ తెలిపింది. దింతో కర్నూలు నుంచి ఈ నగరాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి సమయం కలిసి వస్తుంది మొత్తానికి ఎంతో కాలంగా ఓర్వకల్లు విమానాశ్ర యం నుంచి విమాన రాక పోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న కర్నూలు వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Related Posts