YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలవరం పనులు పరుగో.. పరుగు

పోలవరం పనులు పరుగో.. పరుగు

పోలవరం పనులు పరుగో.. పరుగు
ఏలూరు, ఫిబ్రవరి 8,
ప్ర‌తి ప‌నికీ ఓ ప‌ద్ద‌తి ఓ క్లారిటీ ఓ విజ‌నూ ఉండాలి. లేదంటే అంతా మ‌ద్దెల ద‌రువు ఎవ్వారాలే అవుతుంట‌య్. ఇప్పుడు పోల‌వ‌రం ప‌నులు చూస్తుంటే కూడా అంతే అనిపిస్తోంది. ఏ మాత్రం క్లారిటీ ఉండ‌దు. అస‌లు బీజేపీ ఏం మాట్లాడుతుందో.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం మాట్లాడుతుందో.. ఎవ్వ‌రికీ అర్దం కాదు. ఏదో అన్న‌ట్లు.. ఈ పంచాయితీలే ఎటూ తేల‌వు. అయినా స‌రే.. ఒక‌రు వైఎస్ విగ్ర‌హం పెట్టాలి అంటే.. ఇంకొక‌రు.. అట‌ల్ బిహారీ వాజ్ పేయి విగ్ర‌హం పెట్టాలి అంటారు. స‌రె స‌రెలే.. ఏదో ఒక‌టి పెడుదురు గానీ.. లేదంటే.. రెండు విగ్ర‌హాలు ప‌క్క ప‌క్క‌నే పెడుదురులే అంటే నేమో.. ఏ ప‌నీ ఎటూ తేల్చ‌రు. ఇప్ప‌టికి కూడా అంతే ఉంది పోల‌వ‌రం ఎవ్వారం. పార్ల‌మెంట్ లో ఎంపీ విజ‌య సాయి పోల‌వ‌రంపై రెయిజ్ చేసిన క్వ‌శ్చ‌న్ కి.. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ బొమ్మ చూపించే ఆన్స‌ర్ ఇచ్చారు. మ‌రి ఆ ఆన్స‌ర్ ఏంద‌య్యా అంటే.. పోల‌వ‌రానికి నిధులు పెంచం. పెంచం అంటే పెంచం.. అంతే. అస‌లు నిధులు అవ‌స‌రమే లేదు పోల‌వ‌రానికి. నిధుల స‌మ‌స్య అంత‌కంటే లేదు. లేటెందుక‌వుతుంది అంటే.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు కాబ‌ట్టి.. లేట్ అవుతుంది. అంతే త‌ప్ప‌.. మేమైతే ఈ పాటికి క‌ట్టి ప‌డేసే వాళ్లం అంటున్నారు. విజ‌య‌సాయి ఏమో. ప్రాజెక్ట్ కి 47 వేల కోట్లకంటే పైనే ఖ‌ర్చు అవుతుంద‌ని.. ఒక క‌మిటీ చెప్పింది. ‌మ‌రో క‌మిటీ ఏమో.. 55 వేల కోట్ల‌కంటే పైనే ఖ‌ర్చు అవుతుంది అని చెప్పింది. మేం ఇప్ప‌టికే రెండు వేల ఐదొంద‌ల కోట్లు ఖర్చు చేశాం ఇంకా ఎక్క‌డి నుంచి తేవాలి అన్నారు. అయితే.. దీనిపై స్పందించిన కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి.. గ‌జేంద్ర సింగ్ ఏమో మ‌ళ్లీ పాత పాటే పాడారు. కాక‌పోతే కాస్త లౌడ్ గా పాడారు. ఆ నిధులు ఈ నిధులు అంటే ఉండ‌వు. జ‌స్ట్ 2014 అంచ‌నాల ప్ర‌కార‌మే క‌ట్టాలి. విభ‌జ‌న రూల్స్ అయితే అలాగే ఉన్న‌య్. ఆ లెక్క‌ల ప్రకారం మేం నిధులు ఇస్తాం.. అంతే కానీ.. 47 వేల కోట్లు.. 55 వేల కోట్లు అంటే ఎక్క‌డ్నుంచి తేవాలి. 2014 ఖ‌ర్చుల ప్ర‌కారం క‌ట్టండి. క్వాలిటీగా ప‌క‌డ్బంధీగా.. అద్దిరిపోయేలా క‌ట్టాలి అని మ‌రోసారి క్లియ‌ర్ గా క్లారిటీ ఇచ్చారు. ఇలా ఒక‌రి మాట‌ల‌కు ఇంకొక‌రి మాట‌లకు.. కొండ శిఖ‌రానికి.. న‌దిలోని పాతాళానికి ఉన్నంత తేడా ఉంది. వీరిద్ద‌రి మాట‌లూ క‌ల‌వాలి.. పోల‌వరం పూర్తి అవ్వాలి అంటే.. ఎప్పుడ‌వుతుందో చూడాలి.

Related Posts