YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 టీ కాంగ్రెస్ లో మళ్లీ జోష్

 టీ కాంగ్రెస్ లో మళ్లీ జోష్

 టీ కాంగ్రెస్ లో మళ్లీ జోష్
హైదరాబాద్, ఫిబ్రవరి 9,
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ మొదలైనట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుస కార్యక్రమాలు చేస్తున్న పార్టీ నాయకత్వం.. కార్యకర్తల్లో ధైర్యాన్ని, భరోసాని నింపే ప్రయత్నం చేస్తోంది. మరి కాంగ్రెస్‌ ఖమ్మం సభ సాక్షిగా కాంగ్రెస్ ఏం చెప్పబోతుంది..? ఆ పార్టీ పూర్వ వైభవానికి నేతలు వేస్తున్న ఫ్యూచర్‌ ప్లాన్‌ ఏంటి..? రాష్ట్రంలోని నేతలంతా పాల్గొన్న సమావేశంలో బూత్‌ స్థాయి నాయకులకు ఐడీ కార్డులివ్వడంతో పాటు.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేశారు నేతలు. అధికార టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిచారు. అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో ఢిల్లీలో దోస్తీ చేస్తూ.. గల్లీలో పోరాటం చేస్తున్నారని, ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్య బట్టారు. కేసీఆర్ అప్రజాస్వామ్యానికి చెరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు నాయకులు.ఖమ్మం జిల్లాలో కూడా టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, వాళ్ల లెక్కలు కూడా త్వరలోనే తేలుస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. త్వరలో జరగనున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కానుక ఇవ్వాలని పార్టీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. సెంట్రల్‌లో, స్టేట్‌లో కాంగ్రెస్ అధికారంలోకి తప్పకుండా వస్తుందని.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించి జైలులో పెట్టిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు అత్యుత్సాహం ప్రదర్శించిన అందరిపై పనిపడతామన్నారు. ప్రజల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో భావస్వేచ్ఛ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారాయన. మొత్తమ్మీద.. ఖమ్మం జిల్లాలోని సిక్వెల్ రిసార్ట్స్‌లో 33 జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నగర అధ్యక్షులు, బూత్ స్థాయి కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించిన కాంగ్రెస్‌.. తమ సత్తాను నిరుపించుకునే తరుణం వచ్చినట్టు భావిస్తోంది. అందుకే రాష్ట్ర అగ్రనాయకత్వం సమావేశంలో పాల్గొని కార్యకర్తల్లో జోష్‌ నింపింది.

Related Posts