YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీలో పదవుల వేట

గులాబీలో పదవుల వేట

గులాబీలో పదవుల వేట
హైదరాబాద్, ఫిబ్రవరి 9,
అధికార పార్టీ అంటే ఆ లెక్క వేరే. ఎప్పుడు ఎవ‌రు ఎలా మూవ్ అవుతారో తెలియ‌దు. పార్టీ ప‌ద‌వుల‌కి ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో అదే జ‌ర‌గ‌బోతుంది. పార్టీ ప‌ద‌వుల కోసం టీఆర్ఎస్ లో మ‌ళ్లీ ఫైటింగ్ లు జ‌ర‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. కేడ‌ర్ మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.ఇప్ప‌టి దాకా టీఆర్ఎస్ ప‌రిస్థితి ఎలా ఉంది అంటే.. క‌న్ ఫ్యూజ‌న్ లోనే ఉంది. బీజేపీపై ఎటూ తేల్చుకోలేక పోతోంది. ముందుకెళ్లాలా వెన‌క్కి త‌గ్గాలా అర్దం కాక లీడ‌ర్ లు గ‌ప్ చుప్ గా ఉండిపోయారు. ఇప్పుడు ఇంకెలా ఉంటుంది అన్న‌ది క్వ‌శ్చ‌న్ గా మారింది. అస‌లే.. ఓ వైపు బీజేపీ బండి స్పీడ్ పెంచింది. టీఆర్ఎస్ లీడ‌ర్లని మెయిన్ గా టార్గెట్ చేసింది. అధికార పార్టీ కావ‌డంతో.. ఆల్రెడీ బ‌లంగా ఉంది. అన్ని ఏరియాల్లో ప్ర‌తి లీడ‌ర్ కీ ఎంతో కొంత బ‌లం ఉంటుంది. అదే బ‌లాన్ని త‌మ వైపు తిప్పుకోవాల‌ని.. బీజేపీ బానే ఫోక‌స్ చేసింది. లోక‌ల్ గా ప‌వ‌ర్ పెంచుకునేందుకు బీజేపీ బానే స్పీడ్ గా వెళ్తోంది. అస‌లే పట్టులేని ఏరియాల‌పై మ‌రికాస్త ఫోక‌స్ చేసింది. లోక‌ల్ గా బ‌లం పెంచుకుంటే.. పునాదులు గ‌ట్టిగా ఉంటాయ‌నే కాన్ఫిడెన్స్ తో.. సీనియ‌ర్ లీడ‌ర్లు.. పేరున్న లీడ‌ర్ల‌తో పాటు.. లోక‌ల్ లీడ‌ర్ల‌ని కూడా త‌మ వైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తోంది బీజేపీ.ఇక ప‌ద‌వులు లేని లీడ‌ర్లు ప‌క్క చూపులు చూడ‌డం కామ‌నే క‌దా. ఇలాంటి సిచ్చువేష‌న్ లో టీఆర్ఎస్ కూడా లోక‌ల్ లీడ‌ర్లపై కాన్సంట్రేట్ చేస్తోంది. పార్టీ ప‌ద‌వులు అప్ప‌జెప్పే విష‌యంలో కేరింగ్ గా ముందుకెళ్తోంది టీఆర్ఎస్. ఇదే ప్రాసెస్ లో మ‌ళ్లీ జిల్లా క‌మిటీల‌ను వేయాల‌ని నిర్ణ‌యానికి వ‌స్తోందంట‌ టీఆర్ఎస్. స‌భ్య‌త్వ న‌మోదు కూడా పెంచాల‌ని ప్లాన్ చేస్తున్నారు లీడ‌ర్లు.అందుకే టీఆర్ఎస్ లో కూడా ఇప్పుడు ప‌ద‌వులపై కాన్సంట్రేష‌న్ పెరిగింది. లీడ‌ర్లు మొత్తం గ్రామ‌స్థాయిలో బ‌లంగా ప్రిపేర్ అవ్వాల‌ని చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప‌వ‌ర్ పెంచుకోవాల‌నే విష‌యంపై ఫోక‌స్ చేశారు. జిల్లాస్థాయి నుంచి గ్రామ‌స్థాయి వ‌ర‌కు పార్టీ పునరుద్ధ‌రించాల‌నే ప్రాసెస్ న‌డుస్తుండ‌డంతో.. ప‌ద‌వుల్లో ఉన్న వారు.. ప‌ద‌వుల కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా అల‌ర్ట్ అయ్యారు. అందుకే.. ఇప్పుడు అంతా సీనియ‌ర్ లీడ‌ర్ల‌కి ట‌చ్ లో ఉండే విష‌యంపై కాన్సంట్రేష‌న్ పెంచారు. ఇక ఈ ఎవ్వారం కంప్లీట్ అయ్యే వర‌కు.. టీఆర్ఎస్ సీనియ‌ర్ల లీడ‌ర్లు ఫుల్ బిజీ కాబోతున్నారు.

Related Posts