YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ లో ఎంత మార్పు..

కేసీఆర్ లో ఎంత మార్పు..

కేసీఆర్ లో ఎంత మార్పు..
హైదరాబాద్, ఫిబ్రవరి 9,
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో బాగా మార్పు వచ్చిందంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికకు కేసీఆర్ కనీసం ప్రచారానికి వెళ్లలేదు. మంత్రులు కూడా దూరంగా ఉన్నారు. అంతా హరీశ్ రావుకే బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. ప్రచారానికి కూడా ఒకరిద్దరు మంత్రులు తప్ప ఎవరూ దుబ్బాక వైపు చూడలేదు. అక్కడ ఓటమితో కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. నాగార్జున సాగర్ లో గెలుపు ఇప్పుడు కేసీఆర్ అవసరం. తన నాయకత్వం మీద ప్రజలకు ఏమాత్రం విశ్వాసం చెక్కు చెదరలేదని చెప్పుకోవడానికి ఇక్కడ గెలుపు అనివార్యం. అందుకే కేసీఆర్ కూడా ప్రచారం చేయాలని నిర్వహించారు. సాగర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనేందుకు అంగీకరించారు. హాలియా మండలంలో సభను నిర్వహించేందుకు అక్కడి నేతలు ప్రతిపాదించగా ఆయన అంగీకరించడం విశేషం.ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బాధ్యతను ఏ ఒక్క మంత్రిపైనా వదిలిపెట్టేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదు. నల్లగొండ జిల్లా మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డికి బాధ్యతలను అప్పగించినా మండలాల వారీగా మంత్రులను నియమించాలని, వారికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క మండలానికి మంత్రితో పాటు గ్రామాల వారీగా ఎమ్మెల్యేలను కూడా బాధ్యులుగా కేసీఆర్ నియమించనున్నారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ఇప్పటికే నిధులు ఆ నియోజకవర్గానికి మంజూరు చేశారు. అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. దీంతో త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టుల్లో కూడా సాగర్ ప్రాంత నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థిగా జానారెడ్డి ఉండటంతో ప్రతి అంశాన్ని కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించాలని భావిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ నాగార్జున సాగర్ ఎన్నికలో గెలుపునకు అన్ని రకాలుగా వ్యూహాలు రచిస్తున్నారు

Related Posts