YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటెల పదవి సేఫ్

ఈటెల పదవి సేఫ్

ఈటెల పదవి సేఫ్
కరీంనగర్, ఫిబ్రవరి 9, 
కేసీఆర్ ఫ్రెండ్ క‌దా. అజ‌మాయిషీ చెలాయించేంత అనుబంధం ఉంది అన్నారు ఈటెల రాజేంద‌ర్. అంతేలే. ఇర‌వై ఏళ్ల నుంచి అంత ఫ్రెండ్షిప్ ఉంది. పార్టీ ఎదుగుద‌ల‌కు ఈటెల రాజేంద‌ర్ ఎంతో కృషి చేశారు. ఎలాంటి వివాదాలు లేకుండా.. పార్టీ న‌డ‌ప‌డానికి స‌పోర్ట్ చేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు పాయింట్ టు పాయింట్ చుక్క‌లు చూపిస్తూ.. మంత్రి ప‌ద‌విని కూడా ప‌క‌డ్బంధీగా న‌డిపే లీడ‌ర్.. ఈటెల రాజేంద‌ర్. మ‌రి అలాంటి మినిస్ట‌ర్ ఒక్క‌సారిగా ప‌ద‌విలో ఉన్నా లేకున్నా అనే మాట‌లు రావ‌డంతో.. ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. అలా ఎలా అన్నారు.. అస‌లు ఏం జ‌రుగుతోంది అంటూ ఎన్నో డిస్క‌ష‌న్లు న‌డిచాయి. 
ఎందుకంటే.. టీఆర్ఎస్ లో కేసీఆర్ త‌ర్వాత‌.. సీఎం అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్న లీడ‌ర్ ఈటెల రాజేంద‌రే అన‌డంలో ఎలాంటి డౌటూ లేదు. సొంత మ‌నుషులు కాబ‌ట్టి.. హరీశ్ రావు, కేటీఆర్ అంటుంటారు కానీ.. ప‌ద్ద‌తిగా పార్టీ ప్ర‌కారం అయితే.. ఈటెలే నెక్స్ట్ సీఎం. అయితే.. అంత ప‌వ‌రున్న లీడ‌ర్.. అంత మంచి పేరున్న లీడ‌ర్ ఒక్క‌సారిగా ప‌ద‌వి గురించి మాట్లాడే స‌రికి అంతా షాక్ అయ్యారు. కేటీఆర్ సీఎం కాబోతున్నారు.. త‌న టీమ్ ని తాను ఫామ్ చేసుకుంటారు. సీఎంగా ఉండి.. ఈటెల రాజేంద‌ర్ ని క‌మాండ్ చేసే సిచ్చువేష‌న్ ఉంటుందో ఉండ‌దో.. పైగా త‌న‌కి పోటీ కూడా ఈటెల రాజేంద‌రే కాబ‌ట్టి.. సైలెంట్ గా సైడ్ చేస్తారు కేటీఆర్ అనుకున్నారు జ‌నాలు. ఈటెలే ముందుగా కేటీఆర్ ని స‌పోర్ట్ చేసినా.. త‌ర్వాత ప్రాబ్లమ్ అవుతుందేమో అనే భ‌యంతో.. ఈటెల‌ను సైడ్ చేస్తారు అనే లెక్క‌ల్లోనే ఉన్నారు.
కానీ.. కేసీఆర్ అన్నీ తేల్చేశారు క‌దా. బండ‌కేసి కొడ‌తా.. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే అంటూ.. ఫైర్ కావ‌డంతో అంతా మారిపోయింది. ఇప్పుడు మ‌ళ్లీ సీఎంగా కేసీఆరే ఉంటారు అనే టాక్ రావ‌డంతో.. లెక్క‌లు మ‌ళ్లీ మొద‌టికొచ్చాయి. అజ‌మాయిషీ చేసేంత అనుబంధం ఉన్న కేసీఆర్ తో.. త‌ను ప‌ని చేసుకోవ‌డానికి కంఫ‌ర్టే క‌దా. ఈటెల అంటే మాస్ లీడ‌ర్ మంచి మ‌నిషి కాబ‌ట్టి.. సీఎం కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నంత కాలం.. ఈటెల మంత్రి ప‌ద‌వికి ఎలాంటి ప్రాబ్ల‌మూ ఉండ‌దు అనేది ఫుల్ క్లారిటీ.ఎందుకంటే.. ఇప్పుడున్న వాళ్ల‌లో.. మంత్రి ఈటెల రాజేంద‌ర్, మంత్రి హ‌రీశ్ రావులే.. మొద‌ట్నుంచీ పార్టీలో యాక్టివ్ గా ఉండి.. తెలంగాణ కోసం ఎక్కువ‌గా కొట్లాడిన లీడ‌ర్లు. కేటీఆర్ అంటే ఎలాగూ.. సొంత కొడుకు కాబ‌ట్టి.. పెద్ద‌గా ప‌ట్టింపు ఉండ‌దు. హ‌రీశ్ రావుకీ... ఈటెల‌కీ మంత్రి ప‌ద‌వుల విష‌యంలో తేడా వ‌స్తే ఎలా ఉంటుందో.. అప్ప‌ట్లో హ‌రీశ్ రావు విష‌యంలో తెలిసొచ్చింది క‌దా టీఆర్ఎస్ పార్టీకి. జ‌నంలో ఫుల్ వ్య‌తిరేక‌త వ‌స్తుంది. సో.. సీఎం కేసీఆర్.. అలాంటి రిస్కులు తీసుకోరు క‌దా. అయినా.. ఈటెల‌తో సీఎంకి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు కాబ‌ట్టి.. ఆయ‌న మంత్రి ప‌ద‌వికి ఎలాంటి ప్రాబ్ల‌మూ ఉండ‌దు.

Related Posts