ఇరు వర్గాల ఘర్షణలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం
గుత్తి ఫిబ్రవరి 9,
భుత్వాసుపత్రిలో ఇరువర్గాల మధ్య ఘర్షణపడి , ఇరువర్గాల దాడిలో ఆసుపత్రి ప్రధాన ద్వారం అద్దాలు , తలుపులు ధ్వంసమైన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇరు వర్గాల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది . ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన రామాంజినమ్మ, భూలక్ష్మి లు వరుసకు వదినా , మరదళ్లు గత కొన్ని రోజులుగా వీరి మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూలక్ష్మిని రామంజనమ్మ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. సమాచారం తెలుసుకున్న భూలక్ష్మి కుటుంబ సభ్యులు రామాంజనమ్మ కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం కొట్టుకున్నారు.ఈ గొడవలో ఇరువర్గాలకు చెందిన భూలక్ష్మి , రామలక్ష్మి , శ్రీనివాసులు , రాజేశ్వరిలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇరువర్గాల వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ తిరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దాడిలో ఆసుపత్రి ప్రధాన ద్వారం తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడికి , ఘర్షణకు పాల్పడిన ఇరువర్గాలకు చెందిన పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.