YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి

విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి

విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ ఫిబ్రవరి 9, 
రాజ్యాంగ హోదాలో ఉండే వ్యక్తుల పట్ల వైసీపి పెద్దలు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పైన విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పకుండా చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నామని విజయసాయి రెడ్డి చెప్పడం అంగీకారం కాదు. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలి.  రాజ్యాంగం హోదాలో ఉన్న వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి లాంటి వారు ఆ పదవులకు అనర్హులు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలని అన్నారు.
రావాలి జగన్ .. కావాలి జగన్ అన్న ఏపి ప్రజలు , జగన్ పాలన మాకు వద్దని నేడు కోరుకుంటున్నారు.  పంచాయితీ ఎన్నికలలో బెదిరింపులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేయడం సరికాదు. రాష్ట్రంలో పంచాయితీలకు ఎన్నికలు జరగడం లేదు, ఎంపికలు మాత్రమే జరుగుతున్నాయి. ఆటవిక రాజ్యం రాష్ట్రంలో నడుస్తుంది .  దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయింది. దాడులను ప్రశ్నించిన వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నిత్యం బూతులు తిడుతూ, బూతుల శాఖ మంత్రిగా మారిపోయారు. ఆయనపై రాష్ట్ర సీఎం చర్యలు తీసుకోవాలని అయన అన్నారు.

Related Posts