విజయవడ ఫిబ్రవరి 9
ఏపీలో ఓ కీలక ఐఏఎస్ అధికారిపై వేటు పడబోతున్నట్లు సమాచారం. సదరు అధికారిపై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ అధికారి చేసిన అవకతవకలను తవ్వి తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సదరు అధికారి మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టింది.
అయితే తాజాగా సదరు అధికారిపై అధికారిపై సీఐడీ కేసు నమోదు చేయబోతున్నట్టు సమాచారం. గతంలో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వమే పక్కన పెట్టింది. కానీ మళ్లీ రిపోర్టును ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఆ అధికారిపై ప్రస్తుతం సీఐడీ కేసులు నమోదచేయబోతున్నట్టు సమాచారం.అతి త్వరలో ఆ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతున్నారట. మరో రెండు లేదా మూడు రోజుల్లో ఈ విషయంపై బ్రేకింగ్ న్యూస్ రానున్నది.