YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఆ ప్రొటీన్ మ‌న ద‌గ్గ‌ర పుష్క‌లం.. అందుకే భారత్ కరోనాను జయించింది

ఆ ప్రొటీన్ మ‌న ద‌గ్గ‌ర పుష్క‌లం..  అందుకే భారత్ కరోనాను జయించింది

ముంబాయ్ ఫిబ్రవరి 9  
వెస్ట్ బెంగాల్‌లోని క‌ళ్యాణిలో ఉన్న నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యోమెడిక‌ల్ జీనోమిక్స్‌కు చెందిన సైంటిస్టులు కరోనా కు సంబందించిన సీక్రెట్‌ను క‌నుగొన్నారు. ఆసియా దేశాల‌తో పోలిస్తే యూర‌ప్‌, ఉత్త‌ర అమెరికా దేశస్థుల‌లో ఉండే ఓ ప్రొటీన్ లోపం క‌రోనా వ్యాప్తిలో హెచ్చుత‌గ్గుల‌కు కార‌ణ‌మని వాళ్లు తేల్చారు. క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రించ‌డానికి న్యూట్రోఫిల్ ఎలాస్టేస్ అనే ప్రొటీన్ కార‌ణ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు వివ‌రించారు. ఈ ప్రొటీన్ మానవ క‌ణాల్లోకి వెళ్లి, వేగంగా వ్యాప్తి చెంది వైర‌స్‌ను కూడా అలాగే వ్యాప్తి చెందేలా చేస్తోంది. అయితే ఈ ప్రొటీన్‌కు చెక్ పెట్ట‌డానికి మ‌న జీవ వ్య‌వ‌స్థ మ‌రో ప్రొటీన్‌ను రిలీజ్ చేస్తుంది. దీని పేరు ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ (ఏఏటీ). ఈ ఏఏటీ త‌క్కువ‌గా ఉంటే న్యూట్రోఫిల్ ఎలాస్టేస్ ప్రొటీన్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడీ ప్రొటీనే ఆసియా వాసుల‌తో పోలిస్తే.. యూర‌ప్‌, అమెరికా వాసుల్లో చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తాజా ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఇదే అక్క‌డ క‌రోనా వేగంగా వ్యాప్తి చెంద‌డానికి కార‌ణ‌మ‌ని ఈ స్ట‌డీ తేల్చింది. దీని తాలూకు ఫలితాల‌ను ఇన్ఫెక్ష‌న్‌, జెనెటిక్స్‌, ఎవాల్యుష‌న్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్నే వ‌ణికించింది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఈ వైర‌స్ దెబ్బ‌కు అత‌లాకుత‌ల‌మ‌య్యాయి. ఇప్ప‌టికీ అమెరికాలో ల‌క్ష‌ల సంఖ్య‌లో కేసులు వ‌స్తున్నాయి. అటు యురోపియ‌న్ దేశాల్లో కూడా ఈ వైర‌స్ బారిన ప‌డి ల‌క్ష‌ల మంది మృతి చెందారు. అయితే ఆసియా దేశాలు అందులోనూ ఇండియా విష‌యానికి వస్తే క‌రోనా ప్ర‌భావం చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ప్ర‌పంచంలోనే రెండో అత్య‌ధిక జ‌నాభా గ‌ల దేశంలో క‌రోనా ఇంకా ఎంత వేగంగా వ్యాపిస్తుందో.. ఎంత మందిని పొట్ట‌న బెట్టుకుంటుందో అన్న ఆందోళ‌న మొద‌ట్లో వ్య‌క్త‌మైనా.. ప‌రిస్థితి మాత్రం మరీ అంత‌గా దిగ‌జార‌లేదు. ప్ర‌స్తుత‌మైతే కేసులు రోజురోజుకూ ప‌డిపోతున్నాయి. దీని వెనుక కార‌ణం ఏంట‌న్న‌ది చాలా మందికి అంతుబ‌ట్ట‌లేదు. కానీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లోని క‌ళ్యాణిలో ఉన్న నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ‌యోమెడిక‌ల్ జీనోమిక్స్‌కు చెందిన సైంటిస్టులు ఈ సీక్రెట్‌ను క‌నుగొన్నారు. ఆసియా దేశాల‌తో పోలిస్తే యూర‌ప్‌, ఉత్త‌ర అమెరికా దేశస్థుల‌లో ఉండే ఓ ప్రొటీన్ లోపం క‌రోనా వ్యాప్తిలో హెచ్చుత‌గ్గుల‌కు కార‌ణ‌మని వాళ్లు తేల్చారు. క‌రోనా వైర‌స్ మ్యూటెంట్ అయిన డి614జీ అనేది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒకేలా వ్యాపించ‌లేద‌ని ఈ టీమ్‌లోని సైంటిస్టులు నిద‌న్ బిశ్వాస్‌, పార్థ మ‌జుందార్ గుర్తించారు. ఈ మ్యూటెంట్ 50 శాతం వేగంగా వ్యాప్తి చెంద‌డానికి ఆసియాలో 5.5 నెల‌ల స‌మ‌యం తీసుకోగా.. యూర‌ప్‌లో 2.15 నెల‌లు, ఉత్త‌రఅమెరికాలో 2.83 నెల‌లే తీసుకున్న‌ట్లు వీళ్లు చెప్పారు.

Related Posts