YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జగనన్నకు ఎదురు తిరుగుతున్న బాణమా...

జగనన్నకు ఎదురు తిరుగుతున్న బాణమా...

హైదరాబాద్,ఫిబ్రవరి 9, 
తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా షర్మిల అడుగులేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వైఎస్ అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలతో నేడు (మంగళవారం) లోటస్ పాండ్‌లో షర్మిల భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా లోటస్ పాండ్ వద్ద కోలాహలం నెలకొంది. జగన్‌తో షర్మిలకు విబేధాలు ఉన్నాయని.. అందుకే ఆమె పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల లోటస్ పాండ్ భేటీకి మీడియాలో విస్తృతంగా కవరేజీ దక్కింది.కానీ వైఎస్ జగన్ ఫ్యామిలీకి చెందిన సాక్షి మీడియాలో మాత్రం ఎక్కడా షర్మిల భేటీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిషన్లోనూ షర్మిల భేటీకి సంబంధించి కవరేజీ కనిపించలేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతల యాత్రలను.. తమిళనాడులోకి శశికళ ఎంట్రీ తదితర ప్రస్తావించినప్పటికీ.. లోటస్ పాండ్ వ్యవహారాలను పక్కనబెట్టారు. మిగతా తెలుగు న్యూస్ ఛానెళ్లన్నీ లోటస్ పాండ్ వైపు కెమెరాలను మళ్లించగా.. సాక్షి టీవీలో షర్మిల భేటీ అంశానికి కనీస కవరేజీ దక్కలేదు.ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు.. జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేపట్టిన పాదయాత్రను జనాల్లోకి తీసుకెళ్లిన సాక్షి.. ప్రస్తుతం సైలెంటయ్యింది. షర్మిల భేటీ విషయమై వైఎస్సార్సీపీ నేతలు, సీఎం జగన్ సైతం స్పందించలేదు. అదే సమయంలో లోటస్ పాండ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జగన్ ఫొటో కనిపించలేదు.
జగన్, షర్మిల మధ్య విబేధాలే ఈ పరిణామాలకు కారణమా? లేదంటే వ్యూహాత్మకమా అనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటున్న షర్మిల.. రాజన్న కొడుకు, తన సోదరుడు జగన్ ఫొటోను పక్కనబెట్టడం.. అదే సమయంలో షర్మిల భేటీకి సాక్షి మీడియాలో కవరేజీ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో లోటస్ పాండ్‌లో భేటీకి వచ్చిన వారు మాత్రం తాము జగన్ మాట వింటామని బుద్ధిగా చెప్పడం విశేషం.

Related Posts