YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

చెపాక్ లో ఇంగ్లండ్ భారీ విజయం

చెపాక్ లో ఇంగ్లండ్ భారీ విజయం

చెన్నై, ఫిబ్రవరి 9, 
భారత్ జట్టుకి తొలి టెస్టులోనే పర్యాటక ఇంగ్లాండ్ ఊహించని షాకిచ్చింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో 420 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా‌ని 192 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో 227 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న ఇంగ్లాండ్ టీమ్.. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యాన్ని అందుకుంది. రెండో టెస్టు మ్యాచ్‌ చెపాక్‌లోనే శనివారం నుంచి ప్రారంభంకానుంది.420 ఛేదనలో భాగంగా 39/1తో ఈరోజు రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు తొలి సెషన్‌లోనే ప్రధాన వికెట్లని చేజార్చుకుంది. ఓపెనర్ శుభమన్ గిల్ (50: 83 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించినా.. చతేశ్వర్ పుజారా (15), అజింక్య రహానె (0), రిషబ్ పంత్ (11), వాషింగ్టన్ సుందర్ (0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. అయితే.. ఒక ఎండ్‌లో నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ (72: 104 బంతుల్లో 9x4).. అశ్విన్ (9: 46 బంతుల్లో 1x4)తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ.. అశ్విన్ ఔట్ తర్వాత.. కోహ్లీ కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకోగా.. ఆఖర్లో నదీమ్ (0), జస్‌ప్రీత్ బుమ్రా (4) తేలిపోయారు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. జేమ్స్ అండర్సన్ మూడు, జోప్రా ఆర్చర్, డొమినిక్ బెస్, బెన్‌స్టోక్స్ తలో వికెట్ తీశారు.శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 578 పరుగులు చేయగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగుల్ని భారత్ చేసింది. దాంతో.. 241 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకి ఆలౌటైంది. మొత్తంగా.. 420 పరుగుల టార్గెట్ టీమిండియా ముందు నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (218: 377 బంతుల్లో 19x4, 2x6)‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Related Posts