YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అప్పీలుకు మళ్లీ పెద్దిరెడ్డి

అప్పీలుకు మళ్లీ పెద్దిరెడ్డి

విజయవాడ, ఫిబ్రవరి 9, 
ఏపీ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మరోసారి మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌కు వెళ్లారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు (ఫిబ్రవరి 21వరకూ) ప్రెస్‌/ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సమర్థించడాన్ని సవాల్ చేశారు. ఆయన తరఫున న్యాయవాది వీఆర్‌ఎస్‌ ప్రశాంత్‌ ఈ అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. మంగళవారం విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేస్తూ, మీడియాతో మాట్లాడకుండా నిలువరించాలని ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంత్రి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. మీడియాతో మాట్లొడద్దనిస్పష్టం చేశారు. మంత్రిని ఇంటికే పరిమితం చేయాలని ఇచ్చిన ఆదేశాల్ని రద్దు చేశారు.మంత్రి పెద్దిరెడ్డి ధర్మాసనం ముందు మళ్లీ అప్పీల్‌ వేశారు. మీడియాతో మాట్లాడకుండా నిలువరించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను నిరాకరించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనల ప్రకారం ఒక నామినేషన్‌ దాఖలైన చోట ఆ అభ్యర్థి గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి వెంటనే ప్రకటించాలన్నారు. మీడియాతో మాట్లాడినప్పుడు.. చట్ట నిబంధనలను పాటించాలని అధికారులకు కోరానన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా తనను ఆపుతూ ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇటు ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి మరోసారి ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Posts