YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గోరంట్ల గ్రామంలో టీడీపీ గెలుపు

గోరంట్ల గ్రామంలో టీడీపీ గెలుపు

అనంతపురం, ఫిబ్రవరి 9, 
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ సొంత ఊళ్లపై ఫోకస్ పెట్టారు. ఇటు ప్రతిపక్షం టీడీపీతో పాటూ ఇతర పార్టీల నేతలు కూడా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సొంత ఊరిలో పంచాయతీ టీడీపీకి ఏకగ్రీవం అయ్యింది. కర్నూలు మండలం పి. రుద్రవరంలో టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సోమవారం మధుకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ ఊరిలో 10 వార్డుల్లో 1,154 ఓటర్లున్నారు. సర్పంచ్‌ స్థానాలకు ఐదుగురు నామినేషన్‌ దాఖలు చేయగా చివరకు నలుగురు పోటీ నుంచి తప్పుకొన్నారు.. దీంతో మధు సర్పంచ్‌గా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. మధు కూడా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు బంధువు తెలుస్తోంది. ఈ గ్రామం ఏకగ్రీవానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts