YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ ఎన్నికల పక్రియ

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ ఎన్నికల పక్రియ

నెల్లూరు ఫిబ్రవరి 9, 
నెల్లూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ కావలి రెవెన్యూ డివిజన్ లో మంగళవారం జరిగాయి. ఎన్నికలు గుర్తించబడిన పోలింగ్ బూతుల లో ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి ఇ సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు ప్రశాంతంగా జరిగాయి. అక్కడక్కడా కొన్ని చోట్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ జిల్లా కలెక్టర్ చక్రధర బాబు మరియు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ మరియు జిల్లా అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలు కావలి రెవెన్యూ డివిజన్ లోని 9 మండలాలు, 137 గ్రామ పంచాయతీలలో, 1370 పోలింగ్ బూతుల లో నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియను జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు నెల్లూరు నగరంలోని తిక్కన  భవన్ నందు ఏర్పాటు చేయబడిన వీడియో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ హరేంద్ర రెడ్డి స్వయంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లలో ఓట్లు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. వయోవృద్ధులైన ఓటర్లను తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు తమ వంతు చేయూత నందించారు. ఈ సందర్భంగా ఓటింగులో లో యువత క్రియాశీలక పాత్ర వహించి అధికారులకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. వృద్ధులను దివ్యాంగుల ను తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో తమ వంతు కృషి చేశారు. అల్లూరు మండలం శంభుని పాలెం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు అన్న విషయం తెలుసుకుని అధికారులు హుటాహుటిన వెళ్లి సమస్యను పరిష్కరించారు. మూడు గంటల 30 నిమిషాల వరకు నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ అనంతరం అధికారులు ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభించారు.

Related Posts