విశాఖపట్టణం, ఫిబ్రవరి 10,
తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందుకు కారణాలేంటి? అప్పులు.. దానికయ్యే వడ్డీలే ఉక్కు పరిశ్రమకు గుదిబండలా మారాయా? ఇప్పటికిప్పుడు లాభాల బాట పట్టాలంటే విశాఖ స్టీల్ కంపెనీ కోసం కేంద్రం ఏం చేయాలి? అసలు స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న ఆస్తులెన్ని.. అప్పులెన్ని..? విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో పడడానికి అనేక కారణాలున్నాయ్. సొంత ఐరన్ ఓర్, బొగ్గు గనులు లేనందువల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది. అంతేకాక, భారీ రుణభారం, ఆ రుణాల మీద ఉన్న వార్షిక వడ్డీ ఉక్కు కర్మాగారానికి పెనుభారంగా మారింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విలువ 35,222 కోట్ల రూపాయలు. కంపెనీ ఆధీనంలో ఉన్న 19 వేల ఎకరాలకు పైగా ఉన్న భూముల ప్రస్తుత మార్కెట్ విలువను పరిగణలోకి తీసుకోకుండానే చూస్తే కనిపిస్తున్న ఆస్తుల విలువ అది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ 4,889 కోట్ల రూపాయలను మూలధనం పెట్టుబడిగా పెట్టింది. 2020 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు 11,338 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ అప్పు మీద ప్రతీ ఏటా అయ్యే వడ్డీ భారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆయువు తీస్తుంది. 2020 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 15,966 కోట్ల టర్నోవర్ సాధించింది..గడిచిన ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల జీత భత్యాల కోసం 2,662 కోట్ల రూపాయలు అవసరమైంది. వడ్డీ చెల్లింపుల కోసం 1,519 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. ఇక తరుగుదల కోసం 1,111 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. వీటితో పాటు ఇతర ఉత్పత్తి వ్యయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే గడిచిన ఆర్ధిక సంవత్సరంలో సంస్థకు 4,021 కోట్ల నికర నష్టం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వచ్చింది. అంతకుముందు సంవత్సరంలో వచ్చిన నికర నష్టం 412 కోట్లు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేక, టర్నోవరు క్షీణించడం, మరోవైపు స్టీలు ఉత్పత్తికి వాడే ముడిసరుకు ఖర్చులు పెరగడం వల్లే .. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో నష్టాలు వచ్చాయ్..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయమై ప్రధానమంత్రికి రాసిన లేఖలో ప్రస్తావించినట్లుగా.. సంస్థ రుణాల్లో సగమైన ములధన వాటాగా మార్పు చేసి, మిగిలిన అప్పులపై వడ్డీరేటును తగ్గిస్తే ఇతర ప్రభుత్వరంగ సంస్థల మాదిరిగా.. సొంత ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయిస్తే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడవడం ఖాయం. గత డిసెంబరు నెలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాధించిన పనితీరు గమనిస్తే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభదాయకంగా నడపడం సాధ్యమేనని రుజువవుతోంది. 2020 డిసెంబరు నెలలో.. వైజాగ్ స్టీల్ ప్లాంటు 98 శాతం ఉత్పత్తితో పని చేసి 2,100 కోట్ల రూపాయల టర్నవర్‌ను, 170 కోట్ల రూపాయల నికర లాభాన్ని అర్జించింది. గడిచిన 29 నెలల్లో ఇంత మంచి పనితీరు కనబర్చడం ఇదే ప్రధమం.. ఆశాజనకం కూడా. ఇతర ప్రభుత్వరంగ స్టీల్ కంపెనీల్లాగా.. సొంత ఇనుప ఖనిజం , బొగ్గు గనులు ఉంటే ఈ లాభాలు ఇంకా పెరిగేవి. ఏడాదికి 63లక్షల టన్నుల స్టీలు ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉన్న వైజాగ్ స్టీల్‌కు నాణ్యతా పరంగా మంచి గుర్తింపు ఉంది. ఇతర కంపెనీల స్టీలు ఉత్పత్తులతో పోలిస్తే.. వైజాగ్ స్టీల్‌కు ప్రీమియం ధర లభిస్తుంది. స్టీల్ ఉత్పత్తుల మార్కెట్ ఇప్పుడిప్పుడే మెరుగవడం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కలిసొచ్చే