YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నష్టాలకు కారణం ఎవరు...

నష్టాలకు కారణం ఎవరు...

విశాఖపట్టణం, ఫిబ్రవరి 10, 
లాభాల్లో ఉన్న వైజాగ్ స్టీల్‌కు నష్టాలు ఎందుకు వచ్చాయి. ఆ తర్వాత ఎందుకు కోలుకోలేకపోయింది. అసలు స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు చేతుల్లో పెట్టకుండా సంస్థను బాగు చేయలేమా..? ఒకప్పుడు 10, 20 శాతం డిజిన్వెస్ట్‌మెంట్‌ అంటూ భయపెట్టిన కేంద్రం.. ఈసారి వ్యూహాత్మక వందశాతం షేర్ల అమ్మకం అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నా… కార్మికులు, రాజకీయ పార్టీల పోరాటం ఆ ప్రయత్నాలకు అడ్డం పడింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం విశాఖ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశంలోని వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తామని కేంద్రం ప్రకటించింది. దీనిద్వారా లక్షా 75వేల కోట్లు సమీకరించుకోవాలని ఆర్థికశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే విషయాన్ని.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ సమయంలో ప్రకటించారు.ప్రైవేటీకరణ ద్వారా యాజమాన్య హక్కులతో పాటు, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఆర్‌ఐఎన్‌ఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వంద శాతం షేర్‌హోల్డింగ్‌ను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ జనవరి 27న ఆమోదముద్ర వేసింది. ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఆ తర్వాతి కాలంలో… తేరుకొని 21వేల 851 కోట్ల టర్నోవరు సాధించే స్థాయికి చేరింది. నాలుగేళ్లలో 203.6 శాతం వృద్ధి సాధించింది. మొదట లాభాలు ఆర్జించినా.. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల బాటలో నడవడానికి సొంత గనులు లేకపోవడమే ప్రధాన కారణం. కొన్నేళ్లుగా బహిరంగమార్కెట్‌లో ఐరన్ ఓర్, బొగ్గు ధరలు పెరగడంతో 4వేల కోట్ల భారాన్ని స్టీల్ ఫ్యాక్టరీ మోయాల్సి వచ్చింది. ఆధునికీరణ, విస్తరణ చేపట్టడంతో పెద్దఎత్తున ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్కు ప్లాంటు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేందుకు కేంద్రం సిద్ధమైంది.ఏటా 7.3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో నడుస్తున్న ప్లాంట్‌… 2030 నాటికి 20 మిలియన్‌ టన్నుల విస్తరణకు సిద్ధమవుతోంది. సంస్థ పెట్టినప్పటి నుంచి 2020 డిసెంబర్‌ వరకు 200 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది. ఉక్కు ఉత్పత్తిని పెంచడానికి ఈ ప్లాంట్‌ ఫిబ్రవరి 2020 నుంచి మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులతో పనిచేస్తోంది. ఇలాంటి సమయంలో పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోకపోగా.. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.ఘన చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్.. 2015 నుంచి వరుస నష్టాల్లో కూరుకుపోయింది. 2015-16లో 1420.64 కోట్లు, 2016-17లో 1263.16 కోట్లు, 2017-18లో 1,369.01 కోట్ల నష్టం చవిచూసింది. సొంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణమని పార్లమెంట్ స్థాయి సంఘం కూడా నిర్ధారించింది. ఆ నష్టాల కారణంగానే కేంద్రప్రభుత్వం దీన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైంది. మార్కెట్‌ పరిస్థితులు, చైనా నుంచి వచ్చే చౌక దిగుమతులు, నష్టాలకు ప్రధాన కారణంగా చెబుతుండేవారు. వరుసగా మూడేళ్లు నష్టాలు చవిచూశాక.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 97 కోట్ల లాభం సంపాదించింది. విస్తరించిన యూనిట్ల నుంచి ఉత్పత్తిని పెంచి, మార్కెట్‌ను మెరుగుపరుచుకుంది. కానీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. 3 వేల కోట్లకు పైగా నష్టం చవిచూసింది.ఇక సొంత గనులు లేకపోవడంతో.. విశాఖ ఉక్కు కర్మాగారానికి కావాల్సిన ముడి సరుకునంతా బయటినుంచి కొనాల్సి వస్తోంది. ముడి ఇనుము ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో.. భారీ మొత్తాలు వెచ్చించి కొనుగోలు చేయడం అనివార్యంగా మారింది. దేశంలో మేలైన బొగ్గు లభించకపోవడంతో.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే ముడి ఇనుమును చత్తీస్‌గఢ్‌, ఒడిశా నుండి తెప్పిస్తున్నారు. రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు ప్రాంతంలో సుమారు 30 మిలియన్‌ టన్నుల ఇనుప ఖ‌నిజం లభించే గనులున్నాయి…వాటిని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయిస్తే… నష్టాల నుంచి లాభాల వైపు మళ్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.నిర్వహణ వ్యయం పెరుగుతుండటంతో… విశాఖ స్టీల్ ప్లాంటును లాభాల బాటలో నడపడానికి మెకెన్సీ సంస్థను కన్సల్టెంటుగా పెట్టుకొన్నారు. వాళ్ల సూచనలు పాటిస్తే నష్టాల నుంచి బయటపడుతుందని అంతా భావించారు. దేశంలో.. స్టీలుకు డిమాండ్ పెరగటంతో.. భవిష్యత్తు ఇకపై బాగానే ఉంటుందనుకున్నారు. కానీ.. ఇంతలోనే కేంద్రప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను వందశాతం అమ్మేసేందుకు సిద్ధమైంది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆర్ఐఎన్ఎల్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు స్పష్టమౌతోంది. కేంద్రం నిర్ణయంతో ఉక్కునగరం ఉలిక్కిపడింది. ఉద్యమబాట పట్టింది. ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే.. ఎంతటి పోరాటానికైనా సిద్ధమని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఇక అటు రాజకీయంగానూ ఈ వ్యవహారం రచ్చ

Related Posts