YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ టేకోవర్ దిశగా అడుగులు

జగన్ టేకోవర్ దిశగా అడుగులు

విజయవాడ, ఫిబ్రవరి 10, 
జగన్ అంటే చాలా మందికి తెలిసింది బహు తక్కువ. జగన్ వైఎస్సార్ కుమారుడిగానే అందరికీ తెలుసు. ఇక ఆయన వైసీపీని స్థాపించి పోరాడి మరీ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గానే జనాలు జగన్ ని గుర్తు పెట్టుకుంటారు. కానీ జగన్ మొదట సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. జగన్ వ్యాపారదక్షత గురించి ఆయన్ని బాగా ఎరిగిన వ్యాపారవేత్తలు ఎక్కువగానే చెబుతారు. ఒక వ్యాపారవేత్త జన నేతగా మారడం అంటేనే గ్రేట్. జగన్ ఆ రేర్ ఫీట్ ని సాధించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షించాలంటూ జగన్ ప్రధాని మోడీకి రాసిన లేఖ ఒకసారి కనుక పరిశీలిస్తే అందులో రాజకీయ విన్నపాలు కంటే కూడా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త నష్టాలలో ఉన్న పరిశ్రమను ఎలా గట్టెక్కించవచ్చో తెలియచేసే విలువైన సూచనలు, సలహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జగన్ స్టీల్ ప్లాంట్ వంటి సంస్థ లాభాల పాట చాలా తొందరలోనే పడుతుందని కూడా అంచనా వేశారు. దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటో కేంద్రానికి చెప్పారు. మరి ఇదే సీఎం సీట్లో మరొకరు ఉంటే మాత్రం ప్రైవేటీకరణ వద్దు అని మాత్రం విన్నవించేవారు కానీ ఎందుకు చేయరాదు అని ఇంత పక్కాగా చెప్పగలిగేవారు కాదని మేధావులు కూడా అంటున్నారు.రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూమి, ప్రత్యక్షంగా పరోక్షంగా అయిదు లక్షల మంది ప్రజలకు ఉపాది, విశాఖకు ఒక గర్వకారణం అయిన స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ కేంద్రం కనుక ప్రైవేటీకరణకే పట్టుపడితే మాత్రం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని టేకోవర్ చేయాలని కూడా జగన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. కచ్చితంగా స్టీల్ ప్లాంట్ తొందరలో లాభాల బాట పడుతుందని జగన్ కి ఉన్న నమ్మకమే ఇందుకు కారణం. అలాగే విభజన హామీల మేరకు ఈ స్టీల్ ప్లాంట్ కి రాష్ట్రానికి వదిలేసి ప్లాంట్ తీసుకున్న రుణమొత్తం 22 వేల కోట్లను ఈక్విటీగా మార్చాలని కూడా జగన్ సూచిస్తున్నారు.విశాఖను పాలనారాజ‌ధానిగా చేస్తున్న జగన్ కి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండడం చాలా ముఖ్యం. విశాఖ ముంగిటకు పాలనకు తీసుకోకముందే ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడం కూడా అవశ్యం. అయితే ఈ విషయంలో కేంద్రాన్ని ఎదిరించడం కంటే కూడా నచ్చచెప్పే ప్లాంట్ పరిరక్షణ జరిగేలా చూడాలని జగన్ అనుకుంటున్నారు. అందువల్ల జగన్ ప్లాన్ ఏ, బీ, సీలను కూడా రెడీ చేసుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ లోని రెండవ కోణాన్ని కూడా ఇపుడు రాష్ట్రం దేశం చూసే సమయం వచ్చింది అంటున్నారు.

Related Posts