YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*గోరంతదీపం కొండంత వెలుగు*

*గోరంతదీపం కొండంత వెలుగు*

దీపాలను వెలిగించడమనేది తెలుసుకున్న నాటినుండే మానవాళి నాగరికత  అభివృద్ధి చెందిందని భావించవచ్చును. ఆదిలో రాళ్ళ రాపిడితో, కట్టెలతోను, జంతువుల కొవ్వుతోను  ఆదిమానవుడు దీపం వెలిగించడం నేర్చుకున్నాడు. తరువాత గవ్వలతో , శంఖులతో దీప ప్రమిదలు తయారు చేయడం మొదలయింది. ఆ తరువాత తయారు చేయబడిన  మట్టి ప్రమిదలు ఈనాటికి వాడుకలోవున్నవి.
ఆషాఢ మాసం నుండి ఆశ్వీయుజ మాసంవరకు  విశేషంగా వర్షాలు కురుస్తాయి.  దీనితో అనారోగ్యకారకాలైన క్రిములు వాతావరణంలో వ్యాపిస్తాయి.  కలరా వంటి అంటు వ్యాధులని వ్యాపింప చేస్తాయి. అలాటి అంటువ్యాధుల నిర్మూలనకు  కార్తిక దీపోత్సవాలలో వందలాది మంచి నూనె  దీపాలు  మన గృహాలలో వెలిగించడం ఒక సంప్రదాయంగా మారింది. ఇది మన సనాతనులు కనిపెట్టి మనకు అందించిన వైజ్ఞానిక సంపద.  ప్రతీదినమూ  మన ఆలయాలలో వేలకి వేలు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలకాంతుల శక్తికి  రోగ క్రిములు నశిస్తాయి.
*కామాక్షి దీపం*
దీపాలలోనే ఇది పవిత్రమైన దీపం.అందరి గృహాలలో వుండవలసిన దీపం.
పూజకి ముందు  పువ్వులతో  అలంకరించి, బొట్టు పెట్టి మంగళకరంగా దీపం వెలిగించి, నిత్యం పూజించవలసిన దీపం కామాక్షి దీపం. దక్షిణాదిన వంశపారంపర్యంగా యీ కామాక్షి దీపాన్ని  బంగారంలా కాపాడుకోవడం ఒక ఆచారంగా పాటిస్తారు.  కొంతమంది తమ గృహాలలో, వారి పెద్దవారు వెలిగిస్తూ వచ్చిన కామాక్షి  దీపం ఆరిపోకుండా కాపాడుకుంటూ వస్తారు. గృహ ప్రవేశ సమయాలలో,  వధూవరులు  పెళ్ళి పందిరికి ప్రదక్షిణం చేసినప్పుడు , అంధకారాన్ని తొలగించే విధంగా , అనుగ్రహకాంతులు అందరికీ లభించేలాగ దీపాన్ని పట్టుకుని  భయభక్తులతో తీసుకుని వెళ్ళే దీపం కామాక్షి దీపం. తమ కుమార్తె అత్తవారింటికి వెళ్ళేటప్పుడు రెండు  పెద్ద దీప స్ధంభాలవంటి కుందులు, కామాక్షి దీపాన్ని సారెగా తప్పకుండా యిచ్చి సాగనంపుతారు.
ఓం నమో నారాయణాయ

Related Posts