YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దినకరన్ ప్లాన్ అదేనా

దినకరన్ ప్లాన్ అదేనా

చెన్నై, ఫిబ్రవరి 10, 
తమిళనాట ఎన్నికలకు సమయం దగ్గర పడింది. శశికళ కూడా జైలు నుంచి విడుదలయ్యారు. దినకరన్ ప్రారంభించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని అంత సులువుగా తీసివేయడానికి వీలులేదు. ఇది ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. అన్నాడీఎంకేలో ఉన్న కూటమి పార్టీలకంటే దినకరన్ పార్టీకి పట్టుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే శశికళను అన్నాడీఎంకేలోనైనా చేర్చుకోవాలని, లేకుంటే దినకరన్ పార్టీతో పొత్తు అయినా పెట్టుకోవాలని అన్నాడీఎంకే అధినేతలపై వత్తిడి పెరుగుతుంది.శశికళ ఒక ప్రభావమంతమైన నేత అని ఇప్పటికీ అందరికీ అంగీకరిస్తారు. ఆమె మేనల్లుడు దినకరన్ పార్టీ ఈ ఎన్నికలలో ఓట్లను గణనీయంగా చీల్చగలదని భావిస్తున్నారు. శశికళ జైలులో ఉండగానే జరిగిన మొన్న పార్లమెంటు ఎన్నికల్లో దినకరన్ పార్టీ ఆరు శాతం ఓట్లను సాధించింది. ఒంటరిగా పోటీ చేసి శశికళ లేకుండా ఆరు శాతం ఓట్లను సాధించడాన్ని తక్కువగా అంచనా వేయకూడదని పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.శశికళ ఆర్థికంగా కూడా బలమైన నేత కావడంతో ఈ ఎన్నికల్లో కనీసం పదిహేను శాతం ఓట్లను పొందే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే అధికార అన్నాడీఎంకేకు ఇబ్బంది తప్పదు. శశికళను పార్టీలో చేర్చుకోకపోయినా ఆ పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లో సీట్లను కేటాయిస్తే బాగుంటుందన్న సూచనలు అన్నాడీఎంకేలో విన్పిస్తున్నాయి. దినకరన్ సయితం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులతో టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.అన్నాడీఎంకేలో పోటీ చేసే అభ్యర్థులతో ముందుగానే టచ్ లో ఉండి వారికి ఆర్థిక సాయం అందించేందుకు కూడా దినకరన్ ప్లాన్ చేశారని సమాచారం. గెలిచిన తర్వాత తమను అన్నాడీఎంకేలో చేర్చుకునే విధంగా అన్నాడీఎంకే అధినేతలపై వత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని కూడా చేయాలన్నది దినకరన్ వ్యూహంగా ఉంది. అన్నాడీఎంకే నుంచి పోటీ చేసినా కొందరికి శశికళ, దినకరన్ ఆశీస్సులు అన్ని విధాలుగా అందే అవకాశాలున్నాయని, భవిష్యత్ లో పార్టీని తమ చేతుల్లోకి తీసుకొచ్చేందుకే దినకరన్ ఈ కొత్త ఎత్తుగడ వేశారంటున్నారు. మరి దినకరన్ ప్లాన్ ఫలిస్తుందో? లేదో? చూడాలి.

Related Posts