YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యడ్దీకి ఎదురుతిరుగుతున్నారా

యడ్దీకి ఎదురుతిరుగుతున్నారా

బెంగళూర్, ఫిబ్రవరి 10, 
కర్ణాటకలో యడ్యూరప్ప తిరుగులేని నేత. ఆయనను కంటిన్యూ చేయడం వెనక అనేక కారణాలున్నాయని బీజేేపీలో పెద్ద యెత్తున చర్చ జరుగుతుంది. యడ్యూరప్ప వయసు రీత్యా పార్టీ నిబంధనల ప్రకారం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారని అందరూ ఊహించారు. ఈ మేరకు ప్రచారం బాగా జరిగింది. ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే యడ్యూరప్పను కొనసాగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణముందంటున్నారు.యడ్యూరప్పకు లాగానే త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు సయితం 70వ వడిలో చేరబోతున్నారు. వారికీ ఈ నిబంధన వర్తిస్తుందని చెబుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మరోసారి ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలను చేపట్టాలని బీజేపీలో మెజారిటీ వర్గం కోరుకుంటుంది. అమిత్ షా కూడా కీలక బాధ్యతలను పోషించాలని ఆశిస్తుంది. వీరిద్దరి వల్లనే బీజేపీ దేశ వ్యాప్తంగా ఎదగగలిగిందని, మరికొంత కాలం వీరి సేవలు పార్టీకి, ప్రభుత్వంలో అవసరమని అభిప్రాయపడుతుంది. అది యడ్యూరప్పకు వరంగా మారినట్లు చెబుతున్నారు.వాస్తవానికి యడ్యూరప్పను అధికారంలో ఉన్నప్పుడే తప్పించాలని కేంద్ర నాయకత్వం భావించింది. రాష్ట్ర పార్టీ కూడా ఈ మేరకు సన్నద్ధమయిందంటారు. యడ్యూరప్పపై ఆరోపణలు కూడా ఉండటంతో ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించిదనే అంటారు. ఇందుకోసం మరో నేతను కూడా ఎంపిక చేశారని, వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పతో సంబంధం లేకుండా వెళ్లాలన్నది అధిష్టానం యోచించింది.తమకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పరోక్షంగా యడ్యూరప్ప కేంద్రనాయకత్వానికి చెప్పడం, తనను దించే ప్రయత్నం చేస్తే జేడీఎస్ తో కలసి ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంగా తెలియజేయడంతోనే యడ్యూరప్పను కంటిన్యూ చేశారని, మంత్రివర్గ విస్తరణకు అనుమతిచ్చారని అంటారు. మరి యడ్యూరప్ప చెబుతుంది నిజమే కదా? వయసు రీత్యా తొలగించాలని చూస్తే, అదే నిబంధన అందరికీ వర్తిస్తుంది కదా? అన్నది బీజేపీలో చర్చనీయాంశమైంది.

Related Posts