YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షర్మిలకు ఓ వైపు పీకే...మరో వైపు అనిల్...

షర్మిలకు ఓ వైపు పీకే...మరో వైపు అనిల్...

హైదరాబాద్, ఫిబ్రవరి 10, తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు కారణం అవుతుండగా.. లోటస్ పాండ్‌లో వైయస్ ఆత్మీయులతో, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ,త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రకటించిన తర్వాత ఒక్కొక్కటిగా షర్మిల వెనుక ఎవరు ఉన్నారనే వియమైన క్లారిటీ వస్తోంది.షర్మిల రాజకీయ పార్టీని పెట్టాలనే నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళిక ఉందని, పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అని పార్టీ రూపకర్త బ్రదర్ అనీల్ అనే అభిప్రాయం ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తూ ఉంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించడం కోసం వైఎస్ సన్నిహితులు కేవీపీ, సూర్యుడు ఆమె వెనుక నడుస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు.షర్మిల పార్టీ రూపకర్త అనిల్ కుమార్ కాగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వైఎస్ జగన్‌ను అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకంగా పని చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో షర్మిల కోసం పనిచేయనున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రస్తుతం రాష్ట్రంలో కాస్త వ్యతిరేకత ఉందని, రాజశేఖర్ రెడ్డి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీతో ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది.లోటస్ పాండ్‌లో జరిగిన తొలి సమావేశం కూడా బ్రదర్ అనీల్ సారధ్యంలోనే జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. అక్కడి ఎన్నికల తర్వాత షర్మిల వెనక ఉండి నడిపిస్తారని అంటున్నారు. షర్మిల వెనుక మాత్రం ప్రస్తుతానికి ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్లుగా వారి సన్నిహితులే చెబుతున్నారు. తాజా పరిణామాలతో రాబోయే రోజుల్లో షర్మిల చేయబోయే రాజకీయం ఎలా ఉండనుంది అనే ఆసక్తి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చేవెళ్ల నుంచి పాదయాత్రతెలంగాణ రాష్ట్రంలో వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ ఆరంగ్రేటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయ్. ఇంతకీ వైఎస్ షర్మిల వెనుకున్నది ఎవరనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. వైఎస్ షర్మిల వెనుక వైఎస్ఆర్ ప్రధాన అనుచరులు, సన్నిహితులు ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల వెంట వైఎస్ఆర్ అత్యంత సన్నిహితులు కేవీపీ, సూరీడు ఉన్నట్లు సమాచారం. ఇక షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తారని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రకు ప్లాన్ చేశారని, దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ప్రశాంత్ కిషోర్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని విమర్శించారు. రైతులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుందా అని అడిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎన్నేళ్లైంది.. పక్కా ఇళ్లు అందరికీ వచ్చాయా అని ప్రశ్నించారు.మళ్లీ రాజన్న రాజ్యం రావాలన్న షర్మిల.. రాజన్న రాజ్యం రావాలని అందరూ కోరకుంటున్నారని తెలిపారు. రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని తన నమ్మకం అన్నారు. తాను తెలంగాణ కోసం అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు. రాజన్న సువర్ణ పాలన తెచ్చేందుకే వచ్చానన్నారు. జగన్.. ఏపీలో పని చేస్తున్నారని..తాను తెలంగాణకు కమిటెడ్ గా పని చేయాలనుకుంటున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ పై అభిమానం చెక్కు చెదరలేదన్న షర్మిల.. వైఎస్ పాలనలో రైతు రాజులా బతికాడన్నారు.

Related Posts