YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నేడే జీహెచ్‌ఎంసీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

నేడే జీహెచ్‌ఎంసీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

నేడే జీహెచ్‌ఎంసీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం
హైద‌రాబాద్ ఫిబ్రవరి 10 
జీహెచ్‌ఎంసీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పుర్తయ్యాయి. గురువారం 11 గంటలకు నూతన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 12:30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను చేతులెత్తే విధానం ద్వారా ఎన్నుకోనున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ నాలుగు భాషల్లో ప్రమాణం స్వీకారం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.గ్రేటర్‌లో మొత్తం సభ్యుల సంఖ్య 150 కాగా, లింగోజిగూడ డివిజన్‌ అభ్యర్థి మృతితో 149 మంది, ఎక్స్‌అఫీషియో సభ్యులు 44  కలిపి 193కి గాను 97 మంది హాజరై పూర్తి కోరం ఉంటేనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక పూర్తవుతుంది. కోరం లేకపోతే మరుసటి రోజు వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా పూర్తి కోరం లేకపోతే మూడో సమావేశంలో హాజరైన సభ్యుల్లో ఎక్కువమంది మద్దతు ఎవరికుంటే వారిని మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ప్రకటిస్తారు. 
ప్ర‌మాణ‌స్వీకార ప‌త్రం
  . . . అనే నేను . . . పురపాలక సంఘం/నగరపాలక సంస్థ సభ్యునిగా, శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని ‘దైవ సాక్షిగా/నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను.

Related Posts