YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దేశంలోకి అక్ర‌మ చొర‌బాట్లు తగ్గాయి: కేంద్ర హోంశాఖ

దేశంలోకి అక్ర‌మ చొర‌బాట్లు తగ్గాయి: కేంద్ర హోంశాఖ

దేశంలోకి అక్ర‌మ చొర‌బాట్లు తగ్గాయి: కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ ఫిబ్రవరి 10  
 భార‌త్‌-బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల గుండా దేశంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డుతున్న వారి సంఖ్య 2020లో త‌గ్గింద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. రాజ్య‌స‌భ‌లో ఓ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు ఇచ్చిన రాత‌పూర్వ‌క స‌మాధానంలో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్.. బంగ్లా స‌రిహ‌ద్దుల గుండా 2016 నుంచి 2020 వ‌ర‌కు జ‌రిగిన‌ అక్ర‌మ‌ చొర‌బాట్ల వివ‌రాల‌ను వెల్ల‌డించారు.నిత్యానంద్ రాయ్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. 2016లో అక్ర‌మ చొర‌బాట్ల‌కు సంబంధించి మొత్తం 654 కేసులు న‌మోదు కాగా 1,601 మంది అరెస్ట‌య్యారు. 2017లో 456 కేసులు న‌మోద‌వ‌గా 907 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2018లో 420 కేసులు న‌మోదు కాగా 884 మందిని అరెస్ట్ చేశారు. 2019లో కేసులు 500, అరెస్టులు 1,109 రికార్డ‌య్యాయి. 2019తో పోల్చితే 2020లో మాత్రం చాలా త‌క్కువ‌గా 489 కేసులు, 955 అరెస్టులు న‌మోద‌య్యాయి.   

Related Posts