ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ ఫిబ్రవరి 10
నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిబంధనలు అతిక్రమించిన కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బోర్డు నియమాలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఏబీవీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.