ఇస్లామిక్ చట్టం ప్రకారం మైనర్ బాలిక పెళ్లి చేసుకోవచ్చు
పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు
చండీగఢ్ ఫిబ్రవరి 10
ఇస్లామిక్ చట్టం ప్రకారం యుక్త వయసు మైనర్ ముస్లిం బాలిక తన ఇష్టం మేరకు పెళ్లి చేసుకునే హక్కు ఉన్నదని పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. ఇస్లామిక్ చట్టంలోని ఆర్టికల్ 195ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. పునరుత్పత్తి దశకు రాని మైనర్లు వాళ్ల గార్డియన్ల ద్వారా వివాహ బంధంలోకి అడుగుపెట్టవచ్చు. యుక్త వయసు మైనర్లు మాత్రం తమ ఇష్టం మేరకు గార్డియన్ అనుమతి ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవచ్చు అని ఆ ఆర్టికల్‌లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. పంజాబ్‌కు చెందిన ఓ ముస్లిం జంట వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అల్కా సరిన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. 37 ఏళ్ల వ్యక్తి, 17 ఏళ్ల అమ్మాయి గత నెల 21న పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ల పెళ్లి ఇష్టం లేని కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తున్నారని, వాళ్ల నుంచి రక్షణ కల్పించాలని ఈ జంట కోర్టును ఆశ్రయించింది. అమ్మాయి మైనర్ అయినా కూడా ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లుతుందని తీర్పు చెప్పిన కోర్టు.. వాళ్లకు రక్షణ కల్పించాలని మొహాలీ ఎస్ఎస్‌పీని ఆదేశించింది.