YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మానస పుత్రికకు కష్టాలు

మానస పుత్రికకు కష్టాలు

విజయవాడ, ఫిబ్రవరి 11, 
జగన్ తాను ఎంతో చేయాలనుకుని పదేళ్ల పాటు అనేక పధకాలు ప్రణాళికలు వేసుకున్న మీదట 2019 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక జగన్ సీఎం గా ప్రమాణం చేయగానే ప్రజలకు పాలన మరింతగా చేరువ చేసే ప్రయత్నంలో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత వార్డులలో సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దనే సంక్షేమ రాజ్యం తెచ్చారు. ఒక విధంగా ఇది దేశంలోనే ఎక్కడా లేని పధకం. జగన్ మానసపుత్రిక అని కూడా చెప్పాలి. అటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నెలకు అయిదు వేల రూపాయల‌ గౌరవ వేతనం ఇస్తున్నారు. వాలంటీర్లు మాకు ఉన్నారు. ఏ పని అయినా పైన ఆదేశం వచ్చిందే తడవు దిగువున క్షేత్ర స్థాయిలో క్షణాల్లో అమలు అవుతుంది అని ఈ రోజు దాకా వైసీపీ సర్కార్ సగర్వంగా చాటి చెప్పుకునేది. మరో వైపు వాలంటీర్ల వ్యవస్థ అంటే అది వైసీపీ కార్యకర్తలది అని టీడీపీ వంటి పార్టీలు కూడా విమర్శలు చేసే పరిస్థితి కూడా ఉంది. పంచాయతీ ఎన్నికల వేళ వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది అంటే ఈ వ్యవస్థ మీద పార్టీ ముద్ర ఎంత బలంగా ప్రతిపక్షాలు వేశాయో అర్ధమవుతుంది. అంటువంటి వాలంటీర్లు సమ్మె చేస్తాం సేవలు బంద్ చేస్తామంటూ భారీ ప్రకటనలు ఇస్తున్నారు అంటే మొత్తంగా రివర్స్ అయినట్లే అనుకోవాలా.చంద్రబాబు అయిదేళ్ల ఏలుబడిలో ఒక్క ఉద్యోగం కొత్తగా ఇవ్వలేదు. మరో వైపు చూస్తే నిరుగ్యోగ భృతి అంటూ ఎన్నికల వేళ హడావుడి చేసినా ఫలితం లేదు. కానీ జగన్ అధికారంలోకి వస్తూనే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లక్షలాదిమందికు ఉపాధి కలిపించారు. అలాగే సచివాలయాల ద్వారా మరింతమందికి ఉద్యోగాలు దొరికాయి. ఇలా నాలుగున్నర లక్షల మందికి బతుకు తెరువు దొరికింది గట్టిగా రెండేళ్లు కూడా ఈ వ్యవస్థకు పూర్తి కాలేదు. సరైన సమయం చూసి సర్కార్ వేతనాలు పెంచే అవకాశం కూడా ఉంది. కానీ ఇంతలోనే రాముడినే ఎదిరించిన హనుమంతుడి మాదిరిగా వాలంటీర్లు వీధిన పడడం మాత్రం సంచలనమే రేపుతోంది. జగన్ కి పాలాభిషేకాలు చేసి ఆయనను దేవుడిగా కొలిచిన వారిలో ఇంతలోనే ఇలా మార్పు రావడం అంటే రాజకీయ కలియుగం అనుకోవాలేమో.గతంలో జన్మభూమి కమిటీల పేరిట పార్టీ కార్యకర్తలకు మొత్తం ప్రభుత్వ విధులు అన్నీ అప్పగించి చంద్రబాబు సర్కార్ చాలానే చేసింది. వారు కూడా ప్రభుత్వ ప్రచారం చేస్తూ రాజకీయాలు బాగా చేసేవారు. దానికి భిన్నంగా జగన్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థ తెచ్చింది. వారి సేవలు కూడా జాతీయ స్థాయిలోనే మెప్పు పొందాయి. అయితే 13 జిల్లాలలో ఉన్న వీరందరినీ గాడిలో పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా పూర్తిగా ఉపయోగించుకునే యంత్రాంగం లేదా అన్న చర్చ అయితే ఉంది. ఏది ఏమైనా వాలంటీర్ల డిమాండ్లు హేతుబద్ధమైనవే. అడిగిన తీరు మాత్రమే జగన్ సహా అందరికీ బాధించేలా ఉందని అంటున్నారు. రేపో మాపో ప్రభుత్వం వీరి వేతనాన్ని పెంచినా తాము పోరాడి సాధించుకున్నాం తప్ప ప్రభుత్వ గొప్పతనం ఏదీ లేదనే అంటారు. మొత్తానికి జగన్ మానసపుత్రిక కంట కన్నీరు ఒలకడం శుభ సూచకం కాదనే చెప్పాలి.

Related Posts