YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సుజనా చౌదరి సైలెంట్ అయిపోయారే

సుజనా చౌదరి  సైలెంట్ అయిపోయారే

విజయవాడ, ఫిబ్రవరి 11, 
జీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ రాజకీయాల పట్ల యాక్టివ్ గా ఉంటారు. ఆయన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ఎండగడుతూ ఢిల్లీ ఉందన్న విషయాన్ని తరచూ సుజనా చౌదరి గుర్తు చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని పదే పదే హెచ్చరించేవారు. కానీ గత కొన్ని నెలలుగా సుజనా చౌదరి సౌండ్ ఏపీ రాజకీయాల్లో విన్పించడం లేదు.సుజనా చౌదరి ఫక్తు టీడీపీ నేత. ఆయనకు టీడీపీయే రాజకీయ బిక్ష పెట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. 2004 నుంచి 2014 వరకూ టీడీపీ అధికారంలో లేకపోయినా సుజనా చౌదరి చంద్రబాబు వెన్నంటే నడిచారు. ఆయనకు ఆర్థికంగా అండాదండా అందించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి చవి చూసిన తర్వాత సుజనా చౌదరి అనూహ్యంగా బీజేపీ లో చేరిపోయారు. తనపైన ఉన్న ఆర్థికపరమైన కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ లో చేరారన్నది వాస్తవం.బీజేపీ లో చేరినా సుజనా చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చేవారు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో ఆయన రైతులకు అండగా నిలిచారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారానికి ఒక సారి ఏపీలో పర్యటించేవారు. జిల్లాల్లో పార్టీ శ్రేణులతో కలసి నడిచేవారు. కానీ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి ఆయన ఏపీలోకి అడుగుపెట్టలేదు. దీనికి తోడు సుజనా చౌదరికి చెందిన వారిని కూడా సోము వీర్రాజు పక్కన పెడుతున్నారు.అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పార్క్ హయత్ హోటల్ లో సుజనా చౌదరి భేటీ కావడం కూడా అప్పట్లో సంచలనం కలిగించింది. అయితే ఇప్పుడు నిమ్మగడ్డపై వైసీపీ ప్రభుత్వం మాటల దాడులకు దిగుతున్నా సుజనా చౌదరి మాత్రం స్పందించడం లేదు. పంచాయతీ ఎన్నికల విషయంలోనూ ఆయన పట్టించుకోవడంలేదు. కేవలం రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై అసహనంతోనే సుజనా చౌదరి రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం లేదని చెబుతున్నారు

Related Posts