YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆస్తి తగాదాలు... విబేధాలు..?

ఆస్తి తగాదాలు... విబేధాలు..?

హైదరాబాద్, ఫిబ్రవరి 11, 
తెలంగాణలో వైఎస్ జగన్ సోదరి షర్మిల పార్టీ పెట్టబోయే సంకేతాలు ఇవ్వడం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలని అనుకోవడం ఏమిటా..? అనే అంశంపై కూడా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఇక లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఒక్క చోట కూడా జగన్ మోహన్ రెడ్డి ఫోటో లేకపోవడం మరింత సంచలనం అయింది. ముఖ్యంగా కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంది. వైయస్సార్ మరియు షర్మిలకు సన్నిహితుడిగా ఉన్న గోనె ప్రకాశ్ రావు మాట్లాడుతూ జగన్ 2019 ఎన్నికలలో షర్మిలకు వైజాగ్ లోక్ సభ సీటు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, 2020లో రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఆవిడను అప్పట్లో సముదాయించారు అని అన్నారు. అయితే 2020 రాజ్యసభ ఎన్నికల సమయంలో కూడా షర్మిలకు జగన్ సీటు ఇవ్వలేదని, ఆ విషయమై షర్మిలకు కొంత బాధ ఉందని ఆయన అన్నారు. జగన్ భార్య భారతికి , షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేననీ.. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కు- కుటుంబంలోను, పార్టీలోను కూడా కొంత అవమానం జరిగింది అన్న వార్తలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. షర్మిల కు సొంత రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని, జగన్ తో పోలిస్తే ఆయన కంటే తాను ఎక్కువ దూరం పాదయాత్ర చేశానని, ఆయన కంటే ఎక్కువగా పార్టీ కోసం తాను కష్టపడ్డాను అన్న భావన షర్మిల లో ఉందని, వీటికి తోడు వైయస్సార్ సిపి పార్టీ తరఫున తాను కష్టానికి తగిన ప్రతిఫలం లభించలేదని, వైయస్ భారతి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందనే భావన షర్మిల లో కూడా ఉందనే చర్చ బలంగా జరుగుతూ ఉంది. సాక్షి లో షర్మిల గురించి కవరేజ్ పూర్తి గా తగ్గడానికి భారతి ఆజ్ఞ లే కారణం అని అంటూ ఉన్నారు కూడా..!   ఆస్తి పంపకాల విషయంలో కూడా జగన్ మరియు షర్మిల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనే వాదన తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆస్తుల విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడిన విభేదాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరాయని, ఒకవైపు పార్టీలో రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోవడం, లోక్ సభ , రాజ్యసభ విషయంలో ఇచ్చిన మాట జగన్ తప్పడంతో పాటు ఆస్తుల విషయంలో కూడా తనకు అన్యాయం జరుగుతూ ఉండడంతోనే షర్మిల తన రూట్ ను మార్చిందని కూడా చెబుతూ ఉన్నారు. 

Related Posts