YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి దేశీయం

4 రోజుల దుమ్ము దుమారం

4  రోజుల దుమ్ము దుమారం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11, 
వాహ్.. జింగ్ జింగ్ అమేజింగ్. వారానికి నాలుగు రోజులే ప‌ని అంటే.. మూమూలుగా ఉండ‌దు. జింత్తాత్త జింత్తాత్త‌నే అనుకుంటున్నారా. అయితే ఓ మాట వినండి. ప‌ని రోజులు నాలుగే.. కానీ.. ప‌ని గంట‌లు 48 మాత్రం యాజ్ టీజ్. ఇంత‌కు ముందులాగే.. క‌చ్చితంగా వారానికి 48 గంటలు ప‌ని చేయాల్సిందే. వారానికి 48 గంటలు ప‌ని దినాలు అంటే.. 8 గంట‌ల చొప్పున 6 రోజులు చేసే వారు. ఇప్పుడు వారానికి నాలుగు రోజులే అంటే.. ప‌ని గంట‌లు ఎనిమిది నుంచి 12కు పెరుగుతాయి. అంటే.. రోజుకి రోజున్న‌ర ప‌ని చేయాలి. నాలుగు రోజుల్లో రెండు రోజులు ఎక్స్ ట్రా ప‌నిని క‌వ‌ర్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే.. ఒక్క రోజులో ఒక‌టిన్న‌ర రోజు ప‌ని చేస్తే.. సింపుల్ గా వారంలో నాలుగు రోజులు ప‌ని చేసుకోవ‌చ్చు ఇదీ లెక్క‌.అయ్యిద్దా కాదా అనే క‌న్ ఫ్యూజ‌న్లు ఏం అవ‌స‌రం లేదు. ఎవ్వారం చూస్తుంటే అయ్యేలాగే ఉంది. కేంద్రం దీనిపై చానాళ్ల నుంచి ఫోక‌స్ చేసింది క‌దా. ఆల్రెడీ లెక్క‌లు ఎక్కాలు అన్నీ అయిపోయాయి అంట. ఇలా వ‌ర్క‌వుట్ చేస్తే బానే ఉంటుంది అని క్లారిటీకి వ‌చ్చిందంట కేంద్రం. అందుకే వారానికి నాలుగు రోజులు ప‌ని దినాలు అనే ప్ర‌తి పాద‌న తెర‌పైకి తెచ్చింది. వారం రోజులు రోజూ రావ‌డం ఇబ్బందులు ప‌డ‌డం ఎందుకు.. వ‌చ్చి పోతూ.. జీవితం మొత్తాన్ని ఆఫీస్ కి అంకితం చేసిన ఫీలింగ్ ఉంటుంది క‌దా. ఇలా వారానికి నాలుగు రోజులు కానీ.. ఆఫీసుకి అంకితం చేస్తే.. మూడు రోజులు ఖాళీగా ఉండొచ్చు. అంటే.. స‌గం జీవితాన్ని ఆఫీసుకి కాకుండా.. సొంతానికి కేటాయించుకునే అవ‌కాశం ఉంటుంది. అందుకే.. ఉద్యోగులు కూడా దీనిపై బానే ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నార‌ట‌. జ‌‌పాన్ లో ఇలాంటి ట్ర‌య‌ల్ వేస్తే వ‌ర్క‌వుట్ అయిందంట‌. మూడు రోజుల పాటు.. ఫ్యామిలీతో స‌ర‌దాగా గ‌డిపి ఉంటారు కాబ‌ట్టి.. ఎక్కువ ఉత్సాహంతో చేసి.. 40 శాతం ఎక్కువ డెవ‌ల‌ప్ మెంట్ చూపించార‌ట‌. అందుకే.. దీనిపై ముందుకెళ్తోంది కేంద్రం.అయితే.. కంపెనీలు, ఉద్యోగులపై ఈ వారానికి నాలుగురోజుల ప‌ని గురించి ఎలాంటి ఒత్తిడీ ఉండ‌బోదు. ముందు కంపెనీలు ఒప్పుకోవాలి. త‌ర్వాత కంపెనీలు ఉద్యోగుల్ని ఒప్పించాలి. అవ‌న్నీ జ‌రిగితేనే.. ఈ వారానికి నాలుగు రోజుల డ్యూటీ ఎవ్వారం ఫైన‌ల్ అవుతుంది. కేంద్రం అయితే.. నేన్ కరెక్ట్ గానే ఉన్నా.. నువ్వు ఊ అను చాలు అన్న‌ట్లు ఫిక్స్ అయి కూర్చుంది. మ‌రి కంపెనీ ఊ అన్నా.. ఎంప్లాయిస్ ఊహూ అంటారేమో చూడాలి. అన్నీ అయితే మాత్రం.. దుమ్ము దుమార‌మే. 

Related Posts