YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశ రక్షణకు సదా సిద్దం భారత నావికాదళ విన్యాసాలు

దేశ రక్షణకు సదా సిద్దం భారత నావికాదళ విన్యాసాలు

విశాఖపట్నం ఫిబ్రవరి 11 
హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల్లో భద్రతకు సంబంధించి రక్షణ వ్యవస్థల సన్నద్ధతకు, భారత సైన్యాన్ని అప్రమత్తం చేయడానికి దోహదపడేలా ట్రోపెక్స్-21 విన్యాసాలకు భారత రక్షణ దళాలు శ్రీకారం చుట్టాయి. జనవరి మూడో వారంలో మొదలైన ఈ విన్యాసాలు ఫిబ్రవరి మూడో వారం వరకు నిరంతరంగా కొనసాగుతాయని తూర్పునావికాదళ వర్గాలు తెలిపా యి.రెండేళ్లకోసారి జరిగే విన్యాసాలు భారత ఉపఖండంలో తీర ప్రాంతాలు కలిగిన 13 రాష్ట్రాలతో పాటు, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్లో కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. విన్యాసాల్లో యుద్ధనౌకలు, జలాంతర్గాములు, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లు, త్రివిధ దళాల సైన్యం, భారతీయ తీరగస్తీ దళం, మెరైన్ పోలీసులు సమన్వయంతో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశాయి. ఏ క్షణం యుద్ధం వచ్చినా పూర్తి సన్నద్ధతకు ఉపకరించేలా విన్యాసాలు జరుగుతున్నాయని వివరించాయి.

Related Posts