YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాపు సామాజిక వర్గం కోసం జే టీవీ..!!

కాపు సామాజిక వర్గం కోసం జే టీవీ..!!
పవన్ కు మద్దతుగా నిలిచేందుకు ఓ టీవీ చానల్ పెట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తన వాణి బలంగా వినిపించేందుకు దాన్నిఉపయోగించుకోనున్నారు. ఇందుకు తమదైన చానల్ ఉంటే మంచిదని ఆలోచించారు. అందుకే నెంబర్ వన్ టీవీలో పని చేసిన చాలా మంది కొత్తగా పెట్టిన టీవీ చానల్ లో సభ్యులుగా ఉన్నారట. దానిపై దృష్టి సారించారు పవన్. మాజీ ముఖ్యమంత్రి ఒకరి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగినా ఇంకా బాలరిష్టాలను ఎదుర్కోంటోంది ఆ చానల్. ఎక్కడా ఆ టీవీ చానల్ ప్రసారం కావడం లేదు. బీజేపీకి చెందిన నేత దీనికి ఛైర్మన్ గా ఉన్నారు. ఈ చానల్ లో కాపు సామాజిక వర్గం వారికే పెద్ద పీట వేస్తారనే ప్రచారం ఉంది. అందుకే పవన్ కల్యాణ్ ఆ చానల్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. కొత్తగా చానల్ పెట్టడం కంటే ఇప్పుడున్న చానల్స్ లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపారని తెలుస్తోంది.సొంత మీడియాను ప్రమోట్ చేసుకోవాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్ తో వ్యవహరించిన పవన్ కళ్యాణ్… ప్రస్తుతం ఉన్న టాప్ మీడియా సంస్థలన్నీ తనకు వ్యతిరేకమే అనే భావనను ప్రజల్లో కలిగించేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పుడే రంగంలోకి వస్తున్న చానల్ వైపు ఆయన ఆసక్తి చూపడం వెనుక రాజకీయ కారణముందంటున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు. కోట్ల రూపాయాలను ఆ చానల్ లో పెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు అంగీకార పత్రాలపై సంతకాలు చేసుకునేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని మీడియా ఛానల్స్ ను బహిష్కరించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దాని వెనుక కొత్త చానల్ తనకు అండగా ఉంటుందనే ఆలోచనే ఇందుకు కారణమంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా మాట్లాడాడు. మీడియా వారు ఎవరూ ఆ విషయంలో వారిని సమర్థించలేదు. పవన్ కల్యాణ్ కే మద్దతుగా నిలిచారు. వర్మ విషయంలో గతంలో ఎన్నడూ పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్… ఈ సారి అతిగా స్పందించడం వెనుక పెద్ద కారణముంది. వర్మ సాకుతో ఆయన మీడియాను తిట్టడం ప్రారంభించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తిట్లు సాధారణం. అవన్నీ భరిస్తేనే రాజకీయం చేయగలుగుతారు. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. ఇందుకు కొత్తగా ప్రారంభించే చానల్ వారు ఆయనకు సలహాలు, సూచనలు ఇస్తున్నారట. ప్రస్తుతం రన్నింగ్ లోనే ఉన్న ఒక ఛానల్ ను కొనుగోలు చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డీల్ కుదుర్చుకున్నారు. దాని పేరు మార్చి జనసేన అనే అర్థం వచ్చేలా జేటీవీ అనే పేరును కూడా పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని పలువురు పవన్ సన్నిహితులు కూడా ధృవీకరిస్తున్నారు. సొంత ఛానల్ ప్రమోషన్ కోసమే పవన్ కళ్యాణ్ ముందస్తు డ్రామాలు మొదలుపెట్టారేమో అనే వాదన లేకపోలేదు. సొంత మీడియా ఉన్నవారంతా… ఆ మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే విషయాన్ని పవన్ గ్రహించలేకపోతున్నారు. గతంలో స్టూడియో-ఎన్ యాజమాన్య హక్కులను తీసుకున్న టీడీపీ ఆ తర్వాత వెనక్కు తగ్గింది. మిగతా చానల్స్ పెద్దగా తమకు ప్రచారం కల్పించక పోవడమే వారి వైఖరి మార్పుకు కారణమైంది. విషయం ఏదైనా త్వరలోనే జనసేన చానల్ రంగంలోకి రాబోతుందనేది వాస్తవం.

Related Posts